Job Loss in Government sector due to corona crisisకరోనా సంక్షోభం ఆర్ధిక వ్యవస్థను భారీగా దెబ్బ తీసే అవకాశం కనిపిస్తుంది. కొంతమంది నిపుణులు భారీగా ఉద్యోగాల కోత ఉంటుందని అంటున్నారు. తెలంగాణ ఐటీ మంత్రి, కె తారకరామారావు ఇటీవలే ఐటీ కంపెనీల వారితో ఒక మీటింగ్ పెట్టి ఉద్యోగాలు తీయకుండా చూడాలని అవసరమైతే బోనస్లు రద్దు చెయ్యడం, జీతాలు కోత పెట్టి తరువాత ఇవ్వడం వంటివి చెయ్యాలని చెప్పుకొచ్చారు.

అయితే ప్రభుత్వానికే ఆ మేరకు చిత్తశుద్ధి ఉందా అనే అనుమానం కలుగుతుంది. ఉద్యానవన శాఖ కరోనా కారణంగా దాదాపుగా 10 మంది చిన్న ఉద్యోగులను పనిలో నుండి తీసేస్తున్నట్టు ఉత్తరువులు జరీ చేసింది. వీరంతా కాంట్రాక్టు ఉద్యోగులు… కరోనా కారణంగా ప్రభుత్వం వద్ద నిధులు ఇబ్బందిగా మారాయని, ఇందుకోసమే తొలగిస్తున్నామని స్పష్టంగా పేరుకున్నారు.

పైగా ఇప్పుడు ఉద్యోగాలు కోల్పోయిన వారంతా 10,000 రూపాయిలు జీతం కలిగినవారు. దీనివల్ల వారికి ఇల్లు గడవడం కూడా కష్టం అవుతుంది. ఉద్యోగాల విషయంలో ప్రభుత్వమే చిత్తశుద్ధి లేనట్టుగా వ్యవహరిస్తుంటే ఇక ప్రైవేట్ కంపెనీలు ఎలా ఉంటాయో చెప్పనవసరం లేదు. రానున్నది గడ్డు కాలమే అని చెప్పకతప్పదు.

ఇది ఇలా ఉండగా… బుధవారం రాత్రి తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన మెడికల్ బులెటిన్ ప్రకారం రాష్ట్రంలో కరోనా కేసులు 943కు చేరాయి. కేసుల ఉధృతి ఒకరోజు తగ్గుతుంటే… నాలుగు రోజులు పెరుగుతుండడంతో ఈ గొడవ ఎప్పటికి వాదులుతుంది అనేది అర్ధం కాకుండా ఉంది.