Hemant_Soren - YS Jaganజనవరి 26వ తేదీ నుండి పెట్రోల్ పై 25 రూపాయలను తగ్గిస్తామంటూ ఝార్ఖండ్ రాష్ట్ర ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ చేసిన ప్రకటన దేశ వ్యాప్తంగా సంచలనం అయ్యింది. పెట్రోల్, డీజిల్ లపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పన్నుల రూపంలో నిర్ధాక్షణ్యంగా వసూలు చేస్తోన్న నేపధ్యంలో… ఝార్ఖండ్ సీఎం తీసుకున్న నిర్ణయంపై సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి.

ముఖ్యంగా సోషల్ మీడియా అయితే ఈ అంశంపై పెద్ద ఎత్తున స్పందించింది. ఏపీకి సంబంధించిన వారయితే మరో అడుగు ముందుకేసి జగన్ మోహన్ రెడ్డి గారు కూడా ఈ విధంగా తగ్గించాలని డిమాండ్ చేస్తున్నారు. ఎక్కడో బీహార్ రాష్ట్రం పక్కన ఉన్న ఝార్ఖండ్ సీఎం తగ్గిస్తే, ఇంకెక్కడో ఉన్న ఏపీ సీఎంను పెట్రోల్ రేట్ తగ్గించమని అడగడమేంటి? అంటే…

నెటిజన్లు మాత్రం బోలెడు లాజిక్స్ ను చూపిస్తున్నారు. దేశంలో అప్పులను చాలా కంట్రోల్ గా చేస్తుందంటూ ఇటీవల కాలంలో సాక్షిలో ప్రచురితం అయిన అంశాన్ని పోస్ట్ చేస్తూ… అప్పులను ఇంత కంట్రోల్ చేస్తోన్న జగన్ 25 రూపాయలు కాదు, 50 రూపాయలు తగ్గించాలని డిమాండ్ చేస్తున్నారు. పేదల కోసమే తన ప్రభుత్వం అని చెప్తోన్న జగన్, నిజంగా ఈ పని చేస్తే ఎంతోమంది పేదలకు లబ్ది చేకూరుతుందనేది నెటిజన్ల భావన.

2000లో బీహార్ రాష్ట్రం నుండి వేరుచేయబడిన ఝార్ఖండ్ ముఖ్యమంత్రి అంత తగ్గిస్తే, దేశమంతా ఏపీ వైపుకు తిప్పేలా చూస్తానని చెప్పిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇంకెంత తగ్గించాలో అన్న కామెంట్స్ కు కొదవలేదు. ఇందులో మరో అతి ముఖ్యమైన అంశం కూడా చోటు చేసుకుంది. గతంలో హేమంత్ సోరెన్ కు ట్విట్టర్ వేదికగా జగన్ చేసిన కామెంట్ ఈ సందర్భంగా మరోసారి వెలుగులోకి వచ్చింది.

గతంలో ప్రధాని నరేంద్ర మోడీని విమర్శిస్తూ హేమంత్ సోరెన్ ఓ ట్వీట్ చేయగా, ఇలాంటి సమయంలో రాజకీయం తగదంటూ ఝార్ఖండ్ సీఎం చేసిన ట్వీట్ కు జగన్ బదులిచ్చిన విషయం తెలిసిందే. దీంతో నేడు అదే ఝార్ఖండ్ సీఎం దేశంలోనే ఆదర్శవంతమైన నిర్ణయం తీసుకోగా, జగన్ ఎలాంటి స్పందన ఎందుకు వ్యక్తం చేయడం లేదని, అసలు రాజకీయాలు ఎవరు చేస్తున్నారని… ఇలా రకరకాల ప్రశ్నలతో సోషల్ మీడియా నిండిపోయింది.

మొత్తానికి దేశంలో ఝార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ ఒక హీరో మాదిరి అయిపోయారు. మరి ఇదే దోవలో మరిన్ని రాష్ట్రాలు పయనిస్తే ప్రజలకు మంచి చేసిన వారవుతారు. మన రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు జగన్ అండ్ కేసీఆర్ లైతే ‘తగ్గిస్తే కేంద్ర ప్రభుత్వం తగ్గించాలి గానీ, తాము ఒక్క పైసా కూడా తగ్గించేది లేదంటూ’ గతంలో తెగేసి చెప్పిన సంగతి తెలిసిందే. మరి ఝార్ఖండ్ సీఎం నిర్ణయం తర్వాత ఏర్పడిన పరిణామాలతో ఏమైనా ఆలోచనలు చేస్తారేమో చూడాలి.

https://twitter.com/anigalla/status/1476213218380947461