jharkhand election results shocks bjpఎగ్జిట్ పోల్స్ ఫలితాలను నిజం చేస్తూ ఝార్ఖండ్ లో కాంగ్రెస్ – జేఎంఎం – ఆర్జేడీ కూటమి ఆధిక్యం సాధించింది. తాజాగా వెలువడుతున్న ఫలితాలలో కాంగ్రెస్ -జేఎంఎం-ఆర్జేడీ మహాకూటమి మెజార్టీ మార్క్ దాటి ఆధిక్యంలో కొనసాగుతోంది. మొదట్లో కొంత పోటా పోటీ వాతావరణం కనిపించినా మహాకూటమి స్పష్టమైన ఆధిక్యంతో ముందుకుపోతుంది.

మొత్తంగా ఈ కూటమి 45 స్థానాల్లో(ఆధిక్యం+గెలుపు) జోరు కొనసాగిస్తోంది. మొత్తం 28 స్థానాలతో జేఎంఎం అతిపెద్ద పార్టీగా అవతరిస్తోంది. దీంతో ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు హేమంత్ సోరెన్ ప్రభుత్వ ఏర్పాటుకు రంగం సిద్ధం చేస్తున్నారు. ఇక తాజా ఫలితాల్లో అధికార భాజపాకు ఎదురుదెబ్బ తగిలింది.

ప్రస్తుతం బీజేపీ 26 సీట్లు దిశగా సాగుతుంది. మిత్రపక్షమైన ఏజేఎస్ ని కాదని ఒంటరి పోరుకి వెళ్ళడంతో బీజేపీ నష్టపోయిందని పరిశీలకులు అంటున్నారు. అంతటి తో అయిపోలేదు… బీజేపీ తరపున ముఖ్యమంత్రి జంషెడ్ పూర్ తూర్పు నియోజకవర్గంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రఘుబర్ దాస్ తాజా ఫలితాల్లో వెనుకంజలో ఉన్నారు.

ఆయన పై స్వాతంత్ర అభ్యర్థి ముందంజేలో ఉండటం గమనార్హం. పార్లమెంట్ ఎన్నికల ఫలితాలతో ఢీలా పడ్డ కాంగ్రెస్ మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చెయ్యడం, ఇప్పుడు ఈ గెలుపు కొంత మేర ఊపిరి పీల్చుకుంది.