Jennifer Lopez Latest trend కాస్ట్యూమ్స్ విషయంలో హాలీవుడ్ ముద్దుగుమ్మలు ఎంత పొదుపుగా దుస్తులు ధరిస్తారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే ఒక్కోసారి అవి సరికొత్త ట్రెండ్ కు నిదర్శనంగా కూడా నిలుస్తాయి. పాప్ సింగర్ కం హీరోయిన్ గా మారిన జెన్నీఫర్ లోపెజ్ ధరించిన కాస్ట్యూమ్స్ పై ప్రస్తుతం సోషల్ మీడియాలో అలాంటి చర్చలే జరుగుతున్నాయి.

టాప్ లో వైట్ షర్టు వేసుకున్న జెన్నీఫర్, బాటంలో వేసుకున్న జీన్స్ చూసి అంతా అవాక్కవుతున్నారు. రెండు కాళ్ళకు మోకాలు పై వరకే జీన్స్ ఉండడం ఈ కాస్ట్యూమ్ ప్రత్యేకత. మరి ఈ డ్రెస్ కు ఎలాంటి నామకరణం చేస్తారో గానీ, ప్రస్తుతం నెట్టింట ఓ రేంజ్ లో హల్చల్ చేస్తున్నాయి ఈ ఫోటోలు. మన టాలీవుడ్ ‘చందమామ’ కాజల్ కు అయితే జెన్నీఫర్ వేసిన షూస్ తెగ నచ్చేసాయట.