Jenasenani-Pawan-Kalyan-in-dilemma-over -Kapu-reservationఆర్థికంగా వెనుకబడిన వర్గాల (ఇడబ్ల్యుఎస్‌)కు రిజర్వ్‌ చేసిన 10 శాతం సీట్లను ఎస్‌సి, ఎస్‌టి, బిసి జాబితాల్లో లేని మిగతా కులాలలకు చెందిన ఆర్థికంగా వెనుకబడిన వారికి అమలు చేయాలని జగన్ ప్రభుత్వం నిర్ణయించింది. దానితో గతంలో కాపులకు ఈ 10 శాతంలో 5 శాతం ప్రత్యేకంగా రేజర్వేషన్లు కల్పిస్తూ తెలుగు దేశం ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి మంగళం పడినట్లు అయింది. ఇతరులతో పాటుగా కాపులు సహితం 10 శాతం రేజర్వేషన్లలో పోటీ పడవలసిందే.

ఒకప్పుడు కాపు రేజర్వేషన్ల కోసం ఉద్యమించిన ముద్రగడ పద్మనాభం ఎందుకనో ఈ విషయంలో మిన్నకుండిపోయారు. మరోవైపు ఈ విషయంపై ఎలా స్పందించాలి అనేదానిపై జనసేన మల్లగులాలు పడుతుంది. ఒకవర్గం నాయకులు కాపులు జనసేన ఓటు బ్యాంకు అని, వారి సమస్యపై పార్టీ స్పందించాలని అభిప్రాయపడుతున్నారు. పవన్ కళ్యాణ్ తో పాటు మిగతా నాయకులు మాత్రం దీనిపై స్పందిస్తే జనసేన మీద కులముద్ర వేస్తారని భయపడుతున్నారు. దీనితో ఎటూ తేల్చుకోలేకపోతున్నారు.

అయితే తేల్చుకునే లోగా పుణ్యకాలం గడిచిపోతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. మొదటి నుండి కూడా పార్టీ పై కులముద్ర పడుతుందనే కారణంగా పవన్ కళ్యాణ్ తన పార్టీకి మద్దతుగా నిలిచినా కాపులను నిర్లక్ష్యం చేస్తూ వచ్చారు. దీనికారణంగా ఎన్నికలలో కాపులు చాలా వరకూ వైఎస్సార్ కాంగ్రెస్ వైపు మొగ్గు చూపారు. దానితో ఉభయ గోదావరి జిల్లాలలో జనసేన పార్టీ ఎక్కువగా ఫోకస్ చేసినా కేవలం ఒక సీటు తోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది.