JD Seelam reveals secret behind sonia gandhi and ys jaganకాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మాజీ కేంద్ర మంత్రి జేడీ శీలం సోనియా గాంధీకి వీర విధేయుడిగా గుర్తింపుపొందిన నేత. ఆయన తాజాగా ఒక టీవీ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ కాంగ్రెస్, వైఎస్సాఆర్ కాంగ్రెస్ మధ్య 2014 ముందు జరిగిన చీకటి ఒప్పందం గురించి బయట పెట్టారు. ఈ క్రమంలో జగన్ కు బెయిలు ఎలా వచ్చిందో కూడా బయటపెట్టేశారు.

జగన్ జైలులో ఉన్న సమయంలో సోనియా గాంధీ వద్దకు ఒక దూతను పంపి, తనకు బెయిలు వచ్చేందుకు సహకరిస్తే రాష్ట్ర విభజనకు అడ్డు పడను అని హామీ ఇచ్చారట. దీనితో ఆయనకు సోనియా కనికరించడం, జగన్ కు బెయిలు రావడం జరిగిపోయింది. 16 నెలల జైలు జీవితం తరువాత ఆయన బయటకు వచ్చారు.

దానికి తగ్గట్టుగానే జగన్ విభజన వ్యతిరేక స్టాండ్ తీసుకుని కూడా నామమాత్రంగానే రాష్ట్ర విభజనను వ్యతిరేకించారు. అయితే టీడీపీ అభిమానులు జేడీ శీలం చెప్పిన ఈ మాటలను చిన్న వీడియో గా చేసి సోషల్ మీడియా అంతా తిప్పుతున్నారు. రాష్ట్ర విభజనలో జగన్ కూడా కీలక పత్రం పోషించినట్టు అంతా చాటుతున్నారు.