Just One Option Remained for JD Lakshminarayana?మాజీ సిబిఐ జేడీ లక్ష్మీనారాయణ ఇటీవలే జనసేన పార్టీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. పూర్తి జీవితం ప్రజాసేవకే అంకితం చేస్తూ.. సినిమాల్లో ఇక నటించబోనని చెప్పిన పవన్ మాటమార్చారని లక్ష్మీనారాయణ ఆరోపించారు. మళ్లీ సినిమాల్లో నటించాలని పవన్ తీసుకున్ననిర్ణయం ఆయన లోని నిలకడ లేని విధి విధానాలను సూచిస్తుందని లక్ష్మీనారాయణ లేఖలో విమర్శించారు.

అయితే లక్ష్మీనారాయణ తరువాతి అడుగు ఎటు ఉంటుందని అంతా చర్చించుకుంటున్న తరుణంలో తాను రైతుల సేవలోకి వెళ్తున్నా అని ఆయన ఆ మధ్య చెప్పుకొచ్చారు. ఇది ఇలా ఉండగా ఢిల్లీలోని ఆమ్ ఆద్మీ పార్టీ ఇటీవలే అక్కడ జరిగిన ఎన్నికలలో ఘనవిజయం సాధించింది. మోడీ, అమిత్ షాలకు మూడో సారి అధికారం నిలుపుకుని కేజ్రీవాల్ షాక్ ఇచ్చాడు.

ఇప్పుడు ఆ గెలుపు ఊపు మీద ఉన్న కేజ్రీవాల్ దేశవ్యాప్తంగా పార్టీని విస్తరించాలని ఆరాటపడుతున్నారు. ఈ తరుణంలో పార్టీని ఆంధ్రప్రదేశ్ లో లీడ్ చేయాల్సిందిగా జేడీ లక్ష్మీనారాయణని ఆహ్వానించినట్టు సమాచారం. ఇప్పుడు దేశవ్యాప్తంగా కేజ్రీవాల్ కి ఉన్న క్రేజ్ తో ఆమ్ ఆద్మీ పార్టీ ప్రజలలో ప్రభావం చూపిస్తుందని లక్ష్మీనారాయణ ఈ ప్రపోజల్ కు సానుకూలంగానే ఉన్నారట.

అరవింద్ కేజ్రీవాల్ ప్రమాణస్వీకారం రేపు జరగబోతుంది. ఆ తతంగం పూర్తయ్యాక వచ్చే వారంలో లక్ష్మీనారాయణ కేజ్రీవాల్ కూర్చుని మాట్లాడుకోవచ్చు అని వార్తలు వస్తున్నాయి. పోయిన ఎన్నికలలో ఆమ్ ఆద్మీ పార్టీ రెండు తెలుగు రాష్ట్రాలలో కొన్ని స్థానాలలో అభ్యర్ధులని నిలబెట్టింది అయితే వారు ఎటువంటి ప్రభావం చూపించలేకపోయారు.