JD-Lakshminarayana-Manhandled-A-Female-IAS-Officerవిశాఖపట్నం పార్లమెంట్ ఎన్నిక రసవత్తరంగా జరిగింది. విశాఖపట్నం లోక్‌సభకి తెదేపా నుంచి దివంగత మాజీ ఎంపీ ఎం.వి.వి.ఎస్‌.మూర్తి మనమడు, బాలయ్య చిన్నల్లుడు శ్రీభరత్‌, వైకాపా తరఫున సత్యనారాయణ, జనసేన నుంచి సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ, భాజపా నుంచి కేంద్ర మాజీ మంత్రి పురందేశ్వరి పోటీ చేశారు. పోలింగ్ పూర్తయిన నాటి నుండీ జేడీ లక్ష్మీనారాయణకు లభించేలా భారీ ఎత్తున అన్ని పార్టీల నుండి క్రాస్ ఓటింగు జరిగిందని ఆయన గెలవడం ఖాయమని ప్రచారం జరిగింది.

దీనితో జనసేన ఈ సీటు మీద భారీ ఆశలే పెట్టుకుంది. విశాఖపట్నం, నాగబాబు పోటీ చేసిన నరసాపురంలో మాత్రమే ఆ పార్టీకి ఎంతో కొంత అవకాశం ఉంది. నాగబాబు కంటే కూడా లక్ష్మీనారాయణ మీద ఎక్కువ ఆశలు ఉన్నాయి జనసైనికులు. గతంలో ప్రజారాజ్యం పార్టీ కూడా ఎంపీల ఖాతా తెరవలేకపోయింది. అయితే స్థానికి పరిస్థితులు ఈ హైప్ కు దూరంగానే ఉన్నాయని వార్తలు వస్తున్నాయి. ప్రధాన పోటీ టీడీపీ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీల అభ్యర్థుల మధ్యే జరిగిందని వారు అంటున్నారు.

జేడీ లక్ష్మీనారాయణ మూడవ స్థానానికే పరిమితం అవ్వొచ్చు అంటున్నారు. అయితే ఆయన టీడీపీ అభ్యర్థి గెలుపోటములు ప్రభావితం చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అంటున్నారు. “గతంలో 2014 ఎన్నికల సందర్భంగా మల్కాజ్గిరి నుండి పోటీ చేసిన లోక్ సభ అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణ గురించి కూడా ఇలానే హడావుడి చేశారు. అయితే ఆయన కనీసం పోటీ ఇవ్వలేకపోయారు. ఇప్పుడు కూడా అందుకు భిన్నంగా ఏమీ జరగదు,” అంటున్నారు స్థానికంగా పని చేసిన ఒక సర్వే ఆయన.