JD Lakshmi Narayana clarifies on YS Jagan Assetsఓ తెలుగు టీవీ చానల్‌ ఇంటర్వ్యూలో జర్నలిస్టు అడిగిన ప్రశ్నలకు సిబిఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ సమాధానమిచ్చారు. జగన్‌పై లక్ష కోట్ల అవినీతి ఆరోపణ అనేది వాళ్లేదో (రాజకీయ ప్రత్యర్థులు) రాజకీయ ప్రచారం కోసం చేసినట్లుగా ఉందని అన్నారు. తమకు వచ్చిన ఎవిడెన్స్‌ (ఆధారాలు) మేరకే చార్జిషీట్‌లో పొందుపర్చామని, దాని ప్రకారమైతే రూ.1,500 కోట్లు మాత్రమేనని, రూ.లక్ష కోట్లయితే కానే కాదని పేర్కొన్నారు. జగన్‌పై ఆరోపణలు చేసి, ఎవరో రాజకీయంగా వాడుకుని ఉంటే దానికి తామేమీ చేయలేమని తేల్చిచెప్పారు.

వైఎస్‌ జగన్‌పై కేసులు నమోదు చేసి, విచారణాధికారిగా వ్యవహరించిన లక్ష్మీనారాయణ ఇటీవలే జరిగిన ఎన్నికలలో విశాఖపట్నం లోక్‌సభ స్థానం నుంచి జనసేన పార్టీ అభ్యర్థిగా ఎన్నికల్లో పోటీ చేశారు. ఆయన చేసిన ఈ వ్యాఖ్యలతో సాక్షి సంబరాలు అంబరాన్ని అంటాయి. 1500 కోట్లే 1500 కోట్లే అంటూ తమ పేపర్ లోనూ, టీవీలోనూ ఊదరగొడుతుంది. జగన్ కు ఏదో క్లీన్ చిట్ ఇచ్చేసినట్టుగా ఆనందపడిపోతుంది. మరోవైపు రాజకీయ విశ్లేషకులు ఇందులో సంబరపడాల్సింది ఏమీ లేదని అంటున్నారు.

“1500 కోట్లు అనేది ప్రభుత్వ రిజిస్టర్డ్ వేల్యూ. బహిరంగ మార్కెట్ లో వీటి విలువు ఎన్నో రేట్లు ఎక్కువ ఉండొచ్చు. విచారణ సంస్థలు ప్రభుత్వ రిటైర్డ్ వేల్యూ గురించే మాట్లాడతారు. దాదాపుగా 40000 కోట్లు వరకు ఉండొచ్చు,” అని వారు అభిప్రాయపడుతున్నారు. ఇది ఇలా ఉండగా అసలు లక్ష కోట్ల అవినీతే అవినీతి అసలు 1500 కోట్లు అంటే పట్టించుకో అక్కర్లేదు అన్నట్టు ఉంది జగన్ మీడియా వరుస. ఇంకా నయం ఇదే పాయింట్ మీద కేసులు కొట్టేయాలని కోర్టులలో వాదించలేదు.