JC Diwakar Reddy comments on YS Jagan Mohan Reddyతనదైన శైలిలో ప్రత్యర్థుల మీద విమర్శలు చేసే మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి చాలా కాలంగా మీడియా ముందుకు రావడం మానేశారు. తాజాగా పంచాయతీ ఎన్నికల సందర్భంగా అలాగే తన పుట్టినరోజు సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ తనదైన శైలిలో ముఖ్యమంత్రి జగన్ మీద విమర్శలు చేసారు. జగన్ ఒక్కరోజు ఆదాయం మాత్రమే దాదాపుగా మూడు వందల కోట్లు ఉండవచ్చని చెప్పుకొచ్చారు.

అయితే ఇదంతా ఆయన పరిశ్రమలు, సాక్షి ద్వారా వచ్చే ఆదాయానికి అదనం అని చెప్పుకొచ్చారు. ఈ మూడు వందల కోట్లు కేవలం రాష్ట్రంలో జే టాక్స్ ద్వారా వచ్చే అమౌంట్ అని ఆయన ఆరోపించారు. జాగన్ ప్రభుత్వంలో జరుగుతున్న అవినీతికి టీడీపీ వారు పెట్టిన పేరు జే టాక్స్ అనే విషయం తెలిసిందే. ఇది తాను చెబుతున్న మాట కాదని ప్రజలు చెబుతున్న మాట అని ఆయన చెప్పారు.

వైఎస్సార్సీపీ అపూర్వ విజయం అని చెప్పుకుంటున్న పంచాయతీ ఎన్నికల ఫలితాలను కూడా ఆయన తీసిపారేశారు. పంచాయతీ ఎన్నికల్లో డబ్బే ప్రధాన పాత్ర పోషించిందని, అధికార పార్టీ ప్రభావంతోనే ఎన్నికల్లో గెలుపొందుతున్నారని అన్నారు. కుప్పంను చంద్రబాబు బ్రహ్మాండంగా అభివృద్ధి చేసినా.. అధికార పార్టీతో పోటీ పడి డబ్బులు ఇవ్వలేక ఓడిపోయారని చెప్పుకొచ్చారు.

అధికార పార్టీ డబ్బుకు తోడు పోలీసులు భయభ్రాంతులకు గురిచేశారని.. అభివృద్ధి చూసి వైసీపీకి ఓటేశారనడం దొంగ మాటగా తేల్చేశారు. వ్యక్తులు.. పాలసీల మద్య జరిగిన ఎన్నికలు కాదు… మద్యం డబ్బుకు ప్రజలు అమ్ముడుపోతున్నారని.. జగన్ రెడ్డి ఎన్నికల్లో ఎంత డబ్బు అయినా ఖర్చు పెట్టగలరని ఆయన తేల్చారు. అయితే డబ్బు ప్రభావం ఇప్పుడు తట్టుకోలేక పోతే తరువాత అయినా ఎలా ఎదురుకుంటారో?