Pawan Kalyan - Jayaprakash Narayan-జనసేన ఏర్పాటు చేసిన నిజనిర్ధారణ కమిటి పై పవన్ కల్యాణ్ తొలుత చూపిన శ్రద్ధ తర్వాత చూపలేదని లోక్‌సత్తా అధినేత జయప్రకాశ్ నారాయణ అన్నారు. లెక్కలు తేల్చిన తర్వాత ఎలాంటి చర్యలు లేవని, అందుకే తామే సొంతంగా స్వతంత్ర నిపుణులతో కమిటీ ఏర్పాటు చేశామని ఆయన చెప్పుకొచ్చారు.

జనసేన నిజనిర్ధారణ కమిటి తొలిదశ అయితే… నిపుణుల కమిటీ రెండో దశ అని జేపీ అన్నారు. కేంద్రం సమయమిస్తే వెళ్లి కలుస్తామని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా అంశాన్ని తెరపైకి తెచ్చింది నేనేనని ఆయన అన్నారు. రిటైర్డ్ ఐఏఎస్ కాకి మాధవరావు, రిటైర్డ్ ఐపీఎస్ ఆంజనేయ రెడ్డి తదితర మేధావులు ఈ సమావేశానికి హాజరయ్యారు.

ఈ సంధర్భంగా ఆయన మాట్లాడుతూ… ప్రత్యేక హోదాలో అంశాలను సాధించుకోవడానికి పోరాటం చేయాలి. పేరు ఏవైనా కావొచ్చు కానీ.. రాష్ట్రానికి నిధులన్నీ రావాలి. వెనుకబడిన 7 జిల్లాలకు రాయితీలు ఇవ్వాలి. ప్రధాని సమయం ఇస్తే కలిసి అన్ని వివరిస్తాం’ అని లోక్ సత్తా వ్యవస్థాపక అధ్యక్షుడు పేర్కొన్నారు.