jayammu-nischayammu-raa-2nd-day-15min-cutగత కొన్ని సంవత్సరాలుగా పెద్ద హీరోలు సినిమాలు విడుదల కావడం… తొలి రోజుకు వచ్చిన భిన్న స్పందనల తర్వాత, రెండవ రోజు నుండి ఓ 10 నిముషాలో, 15 నిముషాలో కోత పడడం… ఆ తర్వాత ప్రమోషన్లలో ఊదరగొట్టడం పరిపాటిగా మారిపోయింది. బ్యాడ్ టాక్ వచ్చిన ప్రతి పెద్ద సినిమాకు జరిగిన విషయమే. చిన్న సినిమాల విషయంలో మాత్రం “జయమ్ము నిశ్చయమ్మురా” వంటి చాలా అరుదైన సినిమాల విషయంలోనే చొరవ తీసుకుంటున్నారు.

ఎన్నో ఆశలు పెట్టుకున్న “జయమ్ము నిశ్చయమ్మురా” సినిమాపై ప్రేక్షకులు భిన్న స్పందనలు వ్యక్తం కావడంతో… ఆడియన్స్ ఫీడ్ బ్యాక్ తీసుకున్న చిత్ర యూనిట్, ఓ 15 నిముషాల సినిమాను కటింగ్ చేసారు. సినిమా విడుదలైన మరుక్షణమే ఫస్టాఫ్ లో చాలా సీన్లు ఎడిటింగ్ చేయాలన్న అభిప్రాయాన్ని ‘వెబ్ సైట్’ సినీ సమీక్షకులు తేల్చేసారు. దానికి అనుగుణంగానే చిత్ర యూనిట్ నిర్ణయం తీసుకోవడం ‘రివ్యూ’లకు మరింత ప్రాధాన్యత పెంచినట్లయ్యింది. అయితే దీని తర్వాత ఏమైనా ఫలితం మారుతుందేమో చూడాలి.