jayalalithaa-murder-mystery-cbi-investigationసెప్టెంబర్ 22వ తేదీ నాడు చెన్నై అపోలో హాస్పిటల్ లో చేరిన తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత డిసెంబర్ 5వ తేదీన అదే హాస్పిటల్ లో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచిన విషయం తెలిసిందే. 73 రోజుల పాటు సాగిన చికిత్సలో జయలలితను ప్రత్యక్షంగా చూసిన వారు ఒక్కరు కూడా లేకపోవడం విశేషం. తొలుత ‘హెల్త్ బులిటెన్’లు విడుదల చేసిన ఆసుపత్రి యాజమాన్యం, ఆ తర్వాత వాటిని పూర్తిగా నిలిపివేయగా, మళ్ళీ హైకోర్ట్ జోక్యంతో అప్పుడప్పుడు ‘అమ్మ’ ఆరోగ్య సమాచారాన్ని అందించింది.

అయితే పురుచ్చతలైవి దర్శనం కోసం వేచిచూస్తున్న అశేష ప్రజానీకం ఎదురుచూస్తున్న తరుణంలో కనీసం ఒక్క ఫోటో గానీ, వీడియో గానీ విడుదల చేయలేదు. ప్రస్తుతం ఇవే విషయాలను ప్రాధమికంగా చేసుకుని, జయలలిత మృతిపై సిబిఐ విచారణ జరిపించాలని తమిళనాడు తెలుగు యువశక్తి అధ్యక్షులు కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి డిమాండ్ చేస్తున్నారు. ‘అమ్మ’ మృతిపై ప్రజలకు ఎన్నో అనుమానాలు ఉన్నాయని, వాటిని నివృత్తి చేయాలంటే సిబిఐ విచారణ ఒక్కటే మార్గమని, జయమ్మ మరణం వెనుకున్న నిజాలు బాహ్య ప్రపంచానికి తెలియాలని డిమాండ్ చేస్తున్నారు.