జయలలిత అకౌంట్ లో నమోదైన మరణం!

Jayalalithaa Fan Muthusamy dies of heart attack ఒక మనిషి మీద పెట్టుకున్న అభిమానం ఎక్కడి వరకు దారి తీస్తుందో తెలుగు నాట వైయస్ రాజశేఖర్ రెడ్డి చనిపోయిన సమయంలో తెలిసివచ్చింది. జగన్ చెప్పిన సంఖ్యలలో తేడా ఉండవచ్చు గానీ, ఎంతో కొంతమంది వైఎస్ మరణ వార్త విని కాలం చేశారన్నది అంగీకరించాల్సిన సత్యం. అయితే తాజాగా తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆరోగ్యంపై అనేక అనుమానాలు నెలకొన్న నేపధ్యంలో… వ్యక్తమైన పుకార్లకు ఒక వ్యక్తి బలయ్యాడు.

‘పురచ్చితలైవి’ ఆరోగ్యంపై మీడియాలో ప్రసారమవుతున్న వార్తలతో కలత చెందిన 47 ఏళ్ళ ముత్తుస్వామి అనే కార్యకర్త గుండెపోటుకు గురై మరణించాడు. కోయంబత్తూరులోని విమానాశ్రయం సమీపంలో ముత్తుస్వామికి జయలలిత అంటే అంతులేని అభిమానం. సెప్టెంబరు 22న అనారోగ్య కారణాలతో జయలలిత ఆసుపత్రిలో చేరిన తరువాత, ముత్తుస్వామి ఇంట్లోను, స్నేహితుల వద్ద రోజూ ఇదే విషయాన్ని చర్చిస్తూ తీవ్ర ఉద్వేగానికి లోనయ్యేవాడని కుటుంబ సభ్యులు తెలిపారు.

దీంతో ముత్తుస్వామి ధైర్యం చెప్పే పనిలో… అమ్మ క్షేమంగా ఉంటారని, పూర్తి ఆరోగ్యంతో తిరిగి వస్తారని భరోసా ఇచ్చేవారు. కానీ, ఇటీవల గవర్నర్ రావడం, పలువురు కేబినెట్ మంత్రులు జయలలితను పరామర్శించేందుకు వెళ్లడం, ఇదే సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా పుకార్లు పెరిగిపోవడంతో తీవ్ర ఆందోళనకు గురైన ముత్తుస్వామి ఒక్కసారిగా గుండెపోటుకు గురయ్యాడు. కుటుంబ సభ్యులు వేగంగా స్పందించి, అతనిని సమీపంలోని ఆసుపత్రికి తరలించినప్పటికీ ఎలాంటి ఫలితం లేకపోయింది. అప్పటికే ముత్తుస్వామి మృతి చెందినట్టు వైద్యులు ధ్రువీకరించారు. ఈ పరిణామంతో జయలలిత అకౌంట్ లో ఓ అభిమాన మరణం నమోదైంది.



Follow Mirchi9 on Google News

This Week Releases on OTT – Check ‘Rating’ Filter

Hiring Content Writer: We are looking to hire a ‘Telugu’ content writer. Send your sample articles to [email protected]

Akhanda in Mass theatresDon't Miss'కడప'లో కూడా 'కమ్మ' వాళ్ళే కొంటున్నారా?ఏదైనా ఒక మంచి జరిగినపుడు దానిని ఆహ్వానించాలి గానీ, బురద జల్లే ప్రయత్నం చేయకూడదు. ప్రస్తుతం "అఖండ" సినిమాపై ఓ...'కులం' తలుచుకుంటే 'కలెక్షన్స్' వచ్చేస్తాయా?Don't Miss'కులం' తలుచుకుంటే 'కలెక్షన్స్' వచ్చేస్తాయా?ప్రస్తుతం ధియేటర్లలో సందడి చేస్తోన్న "అఖండ" సినిమాకు కులం ఆపాదించే పనిలో ఓ వర్గం తలమునకలై ఉన్నట్లుగా కనపడుతోంది. 'అఖండ'కు...akhanda Dallas Kammas TicketsDon't MissAkhanda U.S. Record: Crying On Kammas Goes To Next LevelNandamuri Balakrishna's Akhanda has taken a flying start at the box office despite the mixed...Akhanda Review RatingDon't MissAkhanda Review - Lengthy Mass JatharaBOTTOM LINE Lengthy Mass Jathara OUR RATING 2.5/5 CENSOR 2h 47m, 'U/A' Certified. What Is...Rumours ys jagan declined appointment for mohan babuDon't Missఅయ్యో... మోహన్ బాబుకే దొరకలేదా..? నిజమేనా..?గత ఎన్నికలకు ముందు తమ బకాయిల విషయంలో టీడీపీ ప్రభుత్వం స్పందించడం లేదని, రోడ్డెక్కి నిరసన తెలిపిన మంచు మోహన్...

Mirchi9