jayalalithaa-death-rumors-new-twistదివంగత ముఖ్యమంత్రి జయలలిత మృతి వెనుక ఎన్నో అనుమానాలు తలెత్తుతున్న విషయం తెలిసిందే. అపోలో హాస్పిటల్ ప్రకటన ప్రకారం డిసెంబర్ 5న (సోమవారం) రాత్రి 11.30కి జయ మృతి చెందారు. అయితే, అంతకు ముందు రోజే… అంటే డిసెంబర్ 4న గుండెపోటు వచ్చినట్టు వైద్యులు చెప్పినప్పటికే జయ చనిపోయారనే వాదనకు క్రమక్రమంగా బలం చేకూరుతోంది.

ఎందుకంటే, ఆదివారం సాయంత్రానికే జయ అంత్యక్రియలకు అన్నాడీఎంకే నేతలు ఏర్పాట్లు మొదలు పెట్టారట. జయ భౌతికకాయాన్ని ప్రజల సందర్శనార్థం ఉంచిన రాజాజీ హాలును శుభ్రం చేయాలని ఆదివారమే ఆదేశాలు అందాయట. దీంతో ముందు రోజే జయ చనిపోయిన విషయం పార్టీలోని కీలక నేతలకు తెలిసి ఉంటుందనే అనుమానాలను పలువురు వ్యక్తం చేస్తున్నారు.

ఇదిలా ఉంటే… అన్నాడీఎంకే పార్టీ పగ్గాలను శశికళకు అప్పగిస్తూ తాజాగా ఆ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. పార్టీ ప్రధాన కార్యదర్శిగా శశికళను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మొన్నటి వరకు ఈ పదవిలో జయలలిత ఉండగా, పార్టీ బాధ్యతలన్నింటినీ శశికళకు అప్పగిస్తూ ఈ రోజు పార్టీ కార్యవర్గం నిర్ణయించింది. ‘అమ్మ’ జయలలిత చూపిన దారిలో పార్టీని నడపాలని శశికళను పార్టీ నేతలు కోరారు. పార్టీలోని కొందరు సీనియర్ నేతలకు శశికళ నాయకత్వం ఇష్టం లేకపోయినా… ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం మద్దతు ఉండటంతో… పని సులభమైంది.