jayalalithaa-demiseఅంచనా వేసినట్లుగా విషాదకరమైన వార్త తమిళ ప్రజలను పలకరించింది. సోమవారం నాడు రాత్రి 11.30 నిముషాలకు జయలలిత తుది శ్వాస వీడినట్లుగా అపోలో ఆసుపత్రి యాజమాన్యం ప్రెస్ నోట్ లో స్పష్టం చేసింది. ఈ వార్త తెలియగానే గుండెలు పగిలేలా రోధించడం తమిళ ప్రజల వంతయ్యింది. అమ్మను ఎప్పుడెప్పుడూ చూద్దామా అని వేచిచూసిన ప్రజలకు, చివరకు ఆమె పార్థీవదేహం దర్శనమివ్వడంతో తట్టుకోలేకపోతున్నారు. నాయకుడు అనే వాడు ప్రజల గుండెల్లోంచి వస్తే ఎలా ఉంటాడో… దానికి నిలువెత్తు నిదర్శనం ‘జయలలిత.’

సెప్టెంబర్ 22వ తేదీన తీవ్ర జ్వరం, డీహైడ్రేషన్ కారణంగా ఆసుపత్రి పాలైన నాటి నుండి జయలలిత ప్రజలకు దూరమయ్యారు. అప్పటినుండి డిసెంబర్ 5వ తేదీ వరకు జరిగిన అనేక నాటకీయ పరిణామాలు బాహ్య ప్రపంచానికి జయలలిత దర్శనం లేకుండా పోయింది. బహుశా ఇస్తున్న మెడికల్ ట్రీట్మెంట్ వలన కాస్త ముఖకవలికకలో మార్పు సంభవించిందేమో… అందుకే ప్రజలకు అమ్మను చూపించడం లేదేమో అన్న టాక్ సర్వత్రా వినపడింది.

కానీ, నేడు పార్థీవదేహం చూస్తున్న ప్రజలకు ఒక రకంగా షాక్ తగిలింది. అంతకు ముందు ఉన్న విధంగా చక్కని ముఖవర్చస్సుతో కళకళలాడుతూ అమ్మ కనపడడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. 70 రోజులకు పైగా మృత్యువుతో పోరాడిన ఒక పేషంట్ మాదిరి ఏ మాత్రం కనపడకపోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. రాజాజీహాల్ లో చివరిసారిగా అమ్మను చూసేందుకు పోటేత్తుతున్న ప్రజానీకం ప్రస్తుతం ఈ విషయం గురించే మాట్లాడుకుంటున్నారు. మృతదేహమంటే నమ్మశక్యం కాని రీతిలో తమ ‘పురచ్చితలైవి’ని దర్శనం చేసుకుంటూ… అమ్మ నిద్రిస్తోందని వ్యాఖ్యానించుకుంటున్నారు.

ఏది ఏమైనా… ఒక కారణజన్మురాలు భువి నుండి దివికెగసింది… ఈ సందర్భంగా ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుందాం..!