jayalalitha-death-was-predicted-by-calendarజ్యోతిష్యంపై ఒక్కొక్కరిది ఒక్కో నమ్మకం. కొందరు నమ్ముతారు, మరికొందరు కొట్టిపడేస్తారు. అయితే కొన్ని సందర్భాలలో జరిగే విషయాలు మాత్రం అందరినీ ఒకటికి రెండు సార్లు ఆలోచించుకునేలా చేస్తాయి. అలాంటి సంఘటనే తమిళనాట విస్తృతంగా హల్చల్ చేస్తోంది. అది కూడా తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయురాలు జయలలిత మరణం గురించి కావడంతో… అత్యంత ప్రాధాన్యతను సంతరించుకునేలా చేసింది.

“2016, డిసెంబర్ 5వ తేదీన ఓ గదిలో మరణం… పక్క గదిలో వారసత్వం కోసం కొట్లాట…” అని ఓ క్యాలెండర్ పై రాసి ఉండడం అందరినీ షాక్ కు గురి చేస్తోంది. క్యాలెండర్ రూపకర్తలు దాదాపుగా ఒక సంవత్సరం ముందే ముద్రణ జరుపుతారు. అంటే డిసెంబర్ 5వ తేదీన ఏదో జరగబోతుందన్న వారి విషయం వారికి ఏడాది ముందే తెలుసా? లేక ఇది కాకతాళీయమేనా? అన్న మీమాంసలో తమిళ జనాలు కొట్టుమిట్టాడుతున్నారు.

సంవత్సరంలోని ప్రతి రోజుకు సంబంధించి ఏదొక విషయం ప్రచురించే సదరు క్యాలెండర్ లో డిసెంబర్ 5వ తేదీన మాత్రం… జయలలిత విషయంలో నూటికి నూరు శాతం జరిగిందే ప్రచురించడం నమ్మశక్యం కాని విషయం మారింది. చెన్నై అపోలో ఆసుపత్రిలో జయలలిత మరణించి ఉండగా, పక్క గదిలో పన్నీర్ సెల్వం నేతృత్వంలో అన్నాడీఏంకే ఎమ్మెల్యేలు జయలలిత వారసుడు కోసం మల్లగుల్లాలు పడిన విషయం తెలిసిందే.

ఈ ప్రభావంతో సదరు క్యాలెండర్ కు సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. స్థానిక తమిళ భాషలో రాసి ఉన్న సదరు క్యాలెండర్ కు భవిష్యత్తు మారిపోయే అవకాశం స్పష్టంగా కనపడుతోంది. ఆ క్యాలెండర్ కు భవిష్యవాణి వినిపించిన జ్యోతిష్యుడు ఎవరో గానీ, జయలలిత మరణంతో అతని భవిష్యత్తు కూడా మారిపోవచ్చు. తన మరణంలో కూడా కొందరికి ఉపయోగపడే విధంగా ‘అమ్మ’ చేసిందని ఈ సందర్భంగా అభిమానులు కొనియాడుతున్నారు.