Jayalaithaa Poes Garden Secret Roomచెన్నైలోని పోయెస్ గార్డెన్ లోని వేద నిలయంపై ఆసక్తికర వార్త ఒకటి తమిళనాట చక్కర్లు కొడుతోంది. మాజీ ముఖ్యమంత్రి, దివంగత జయలలిత జీవితకాలం గడిపిన పోయెస్ గార్డెన్ లోని ‘వేద నిలయం’ తమకు చెందాలంటే తమకు చెందాలని ఆమె నెచ్చెలి శశికళ, మేనకోడలు దీపాజయకుమార్, అన్నాడీఎంకే పార్టీ, కేంద్ర ప్రభుత్వం పావులు కదుపుతున్నాయి. జయలలితకు చెందిన ఆస్తి ఆమె వారసులకు చెందుతుందనకుంటే, దీపక్, దీపలకు ఇవ్వాలి లేదా జయలలితతో జీవితకాలం ఉన్నానని చెబుతున్న శశికళకు ఇవ్వాలి.

అలా కాకుండా దానిని జయలలిత స్మారక నిలయంగా మార్చేందుకు తమిళనాడు ప్రభుత్వం నడుం బిగించింది. ఈ నేపథ్యంలో దానిని జాతీయం చేయాలనుకుంటోంది. జయలలిత ఇంటిపై ప్రేమతో వారంతా ఆ ఇల్లు కావాలనుకోవడం లేదని తమిళనాడులో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. వేద నిలయంలోని ఒక గది కోసమే ఈ పోరాటమని పుకార్లు షికారు చేస్తున్నాయి. జయలలిత తన జీవితకాలంలో సంపాదించిన సొత్తు మొత్తాన్ని ఒక రహస్య గదిలో దాచి ఉంచారని, ఆ గది తెరవడం అంత సులభం కాదన్న ప్రచారం జరుగుతోంది.

ఆ గదికి సంబంధించిన బయోమెట్రిక్ కీ జయలలిత దగ్గరే ఉందని, తన కాలి ముద్రలతో మాత్రమే ఆ సీక్రెట్ డోర్ ను తెరవగలరని చెప్పుకుంటున్నారు. అందువల్లే ఆమె అంతిమ యాత్ర సందర్భంగా ఆమె భౌతికకాయాన్ని దగ్గర్నుంచి చూసిన వాళ్లు, ఆమె కాళ్లు లేకపోవడాన్ని గుర్తించారని, ఆ మధ్య మీడియాలో కూడా కథనాలు వెలువడ్డాయని చెప్పుకుంటున్నారు. తట్టు వ్యాధి కారణంగా కాళ్ళు తొలగించాల్సి వచ్చిందని డాక్టర్ల నుంచి క్లారిటీ వచ్చినా, సీక్రెట్ రూం, బయోమెట్రిక్ కీ వంటి అనుమానాలు అలాగే ఉండిపోయాయి.

అదే సమయంలో జైలు శిక్ష విధించిన రోజు శశికళ వేద నిలయంలో రాత్రి బస చేశారు. ఇది కూడా పలు అనుమానాలను బలపరుస్తోందని తమిళులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇంతకీ సీక్రెట్ గదిలో సొత్తు ఉందా? లేక తరలించేశారా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అసలింతకీ ఈ సీక్రెట్ గది నిజమా? కల్పనా? అన్న దానిపై పలువురు వివరణ ఇస్తూ, కొడనాడు ఎస్టేట్ లో ఆస్తుల కొసమే దొంగతనం జరిగిందని, అందులోనే ఆస్తులు ఉండగా, జయలలిత అధికారిక నివాసంలో ఉండవా? అని లాజిక్కు తీస్తున్నారు.