Jayadev-Galla-Tears-Apart-Modi-Government's-Injustice,-BJP-in-Jittersటీడీపీ తరపున అవిశ్వాస తీర్మానంపై చర్చ మొదలుపెట్టిన గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ మోడీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ప్రధాని మోదీని ఉద్దేశించి మాట్లాడిన సందర్భంలో గల్లా జయదేవ్ ఆయన వైపుకు చూస్తూనే ‘మోసగాడు’ అని మొహం మీదే అభివర్ణించారు. ఆ పదాన్ని రికార్డుల నుంచి తొలగించాలని బీజేపీ ఎంపీలు సభలో ఆందోళన చేశారు.

సాక్షాత్తు ప్రధానినే అలా సంబోధించడంతో అందరు అవాక్కయ్యారు. రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రధానిని అలా అనడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆ పదాన్ని వెంటనే రికార్డుల నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. అయితే జయదేవ్ తెగువకు సోషల్ మీడియాలో అభినందనలు కురుస్తున్నాయి.

జయదేవ్ స్పీచ్ తరువాత టీడీపీ శ్రేణులలో ఉత్సాహం ఉరకలేసింది. సాక్షాత్తు సభలో ప్రధానిని మొహం మీద మోసగాడు అనే తెగువ కేవలం ఒక్క టీడీపీ ఎంపీకే ఉందని, బీజేపీతో లాలూచీ పడుతున్న జగన్ గానీ పవన్ కళ్యాణ్ గానీ మోడీని మోసగాడు అని మొహం మీద అనగలరా? అని వారు ప్రశ్నిస్తున్నారు.

జయదేవ్ మాట్లాడుతున్నప్పుడు బీజేపీ ఎంపీలందరూ తీవ్ర అసౌకర్యంగా కనిపించారు. పదే పదే స్పీకరుకు టీడీపీకి కేవలం 13 నిముషాల సమయం మాత్రమే ఇచ్చారని జయదేవ్ దాదాపుగా గంటనుండి మాట్లాడుతున్నారని గుర్తు చేశారు. దీనిబట్టే జయదేవ్ స్పీచ్ ఎంత వాడీ వేడిగా సాగిందో చెప్పవచ్చు.