jaya-plus-spread-death-rumours-of-jayalalithaతమిళనాడు సీఎం, అన్నాడీఎంకే అధినేత్రి ‘అమ్మ’ జయలలిత మృతి చెందిందనే వదంతిని ముందుగా ప్రసారం చేసింది ‘జయ’ టీవీయేట. సాయంత్రం 5.30 గంటల సమయంలో ఆమె కన్నుమూశారనే వార్తను జయలలిత టీవీ గ్రూప్ నకు చెందిన ‘జయ ప్లస్’లో ప్రసారం చేసింది. ఆమె సొంత ఛానెలే ఈ వార్తను ధ్రువీకరించడంతో మిగతా తమిళ ఛానెళ్లతో పాటు జాతీయ మీడియా కూడా అదే వార్తను ప్రసారం చేశాయి.

అంతేకాకుండా, అన్నాడీఎంకే కార్యాలయంలో పార్టీ జెండాను అనవతం చేయడంతో నిజంగానే జయలలిత మృతి చెందినట్లుగానే భావించారు. అయితే, తమ అభిమాన నాయకురాలు చనిపోయిందనే వార్తను జీర్ణించుకోలేకపోయిన ‘అమ్మ’ అభిమానులు అప్పటికే అపోలో ఆసుపత్రిపై దాడికి పాల్పడ్డారు. పరిస్థితి అదుపు తప్పుతోందని గ్రహించిన తమిళ సర్కారు జయ లలిత మరణ వార్త నిజం కాదని చెప్పాల్సిందిగా అపోలో వైద్యులకు సూచించినట్లు తెలుస్తోంది. ఈ మేరకే అపోలో వైద్యులు తాజా ప్రకటన చేయడం జరిగిందని సమాచారం.