Jaya Janaki Nayaka Teaser బోయపాటి శ్రీను దర్శకత్వం వహించే సినిమాలంటే ఎలా ఉంటాయి? పవర్ ఫుల్ మాస్ డైలాగ్స్… మసాలా సీన్స్… హీరోయిజంతో కూడిన ఫైట్లు… ఇవన్నీ లేకుండా బోయపాటి సినిమాను ఊహించుకోలేం. అయితే ఇవేమీ లేకుండా ఓ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ను బోయపాటి తీయగలరా? అంటే దానికి సమాధానమే “జయ జానకి నాయక” సినిమా అన్న సంకేతాలను తొలి టీజర్ ఇచ్చింది.

ఆహ్లాదకరమైన దేవిశ్రీప్రసాద్ బ్యాక్ గ్రౌండ్ సంగీతంతో వచ్చిన ఈ టీజర్ ప్రేక్షకులకు ఫ్రెష్ ఫీలింగ్ ను కలిగించడంలో సక్సెస్ అయ్యింది. రొటీన్ గానే ఉన్నప్పటికీ, రొమాంటిక్ సీన్స్ తో పాటు ఫ్యామిలీ సన్నివేశాలను చూపించిన ఈ టీజర్ లో బెల్లంకొండ శ్రీనివాస్ సింపుల్ లుక్, రకుల్ ప్రీత్ సింగ్ ఫ్యామిలీ లుక్ ఆకట్టుకునే విధంగా ఉన్నాయి. బోయపాటి టేకింగ్, ప్రొడక్షన్ వాల్యూస్ ప్రతి ఫ్రేంలో కనపడతాయి.

మొత్తానికి ఫస్ట్ టీజర్ తో మంచి మార్కులే పడిన ఈ సినిమా విడుదల ఆగష్టు 11వ తేదీగా ధృవీకరించారు. బెల్లంకొండ శ్రీనివాస్ సరసన రకుల్ ప్రీత్ సింగ్, ప్రజ్ఞా జైస్వాల్, కేథరిన్లు హీరోయిన్లుగా నటిస్తుండగా, జగపతిబాబు ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు. ‘సరైనోడు’ వంటి సూపర్ సక్సెస్ తర్వాత బోయపాటి దర్శకత్వంలో వస్తున్న సినిమా కావడంతో దీనిపై భారీ అంచనాలే ఉన్నాయి.