Janatha Garage Samantha, Janatha Garage Samantha Hot, Janatha Garage Samantha Hot Still, Janatha Garage Samantha Hot Photo, Janatha Garage Hot Samanthaకొరటాల శివ – జూనియర్ ఎన్టీఆర్ ల కాంభినేషన్లో రూపుదిద్దుకుంటున్న ‘జనతా గ్యారేజ్’ సినిమాకు సంబంధించిన ఆన్ లొకేషన్ షూటింగ్ ఫోటోలు సోషల్ మీడియాలో సందడి చేస్తూనే ఉన్నాయి. ఆ ఫోటోలలో ఎక్కువ హీరో జూనియర్ ఎన్టీఆర్ కు సంబంధించినవి కాగా, ఇప్పటివరకు హీరోయిన్ సమంత ఫోటోలు కేవలం రెండు మాత్రమే లీక్ అయ్యాయి. అందులో ఒకటి… హాట్ హాట్ అందాల ప్రదర్శన చేసే విధంగా గ్రీన్ డ్రెస్ వేసుకున్న ఫోటో షూటింగ్ ప్రారంభమైన తొలినాళ్ళల్లో సోషల్ మీడియాలో సందడి చేసింది.

అయితే షూటింగ్ ముగుస్తున్న తరుణంలో తాజాగా సమంత ఉన్న మరో ఆన్ లొకేషన్ పిక్ హల్చల్ చేస్తోంది. ప్రస్తుతం కేరళలో చిత్రీకరణ జరుపుతున్న పాట సందర్భంలోనిది ఈ ఫోటో. చూడబోతుంటే… కాబోయే అక్కినేని వారి కోడలుగా ప్రచారం జరుగుతున్న ఈ ముద్దుగుమ్మ, ‘జనతా గ్యారేజ్’లో ఓ రేంజ్ అందాల విందు చేసిందని, ట్రేడ్ వర్గాల్లో హల్చల్ చేస్తున్న టాక్ ను ఈ ఫోటో ధృవీకరించే విధంగా ఉండడం విశేషం. బహుశా వెండితెరకు దూరమవుతానని, ఫైనల్ కిక్ ‘జనతా గ్యారేజ్’లో చూపిస్తుందేమో..!?