Janatha Garage All Time Records, Janatha Garage Vijayawada All Time Records, Janatha Garage Guntur All Time Records, Janatha Garage Uttar Andhra All Time Records, Janatha Garage Krishna All Time Records, Janatha Garage Godavari Districts All Time Recordsభారీ అంచనాలతో విడుదలైన కొరటాల శివ – మోహన్ లాల్ – జూనియర్ ఎన్టీఆర్ ల ‘జనతా గ్యారేజ్’కు ప్రేక్షకుల నుండి భిన్న స్పందనలు వ్యక్తమైన విషయం తెలిసిందే. అయితే ఆ భారీ అంచనాలు రికార్డు స్థాయి ఓపెనింగ్స్ కు కారణమై, ‘బాహుబలి’ సినిమా రికార్డులను సైతం పక్కన పెట్టేలా చేసింది. తెలుగు సినిమా స్టామినాను పెంచిన ‘బాహుబలి’ రికార్డులను బద్దలు కొట్టి, తొలిరోజు వసూళ్ళల్లో ఆల్ టైం రికార్డులను నెలకొల్పింది ‘జనతా గ్యారేజ్.’

అయితే ఈ రికార్డులు అన్ని ఏరియాలలో కాదు… గుంటూరు, కృష్ణా, తూర్పు గోదావరి, వైజాగ్ (ఉత్తరాంధ్ర) వంటి ఏరియాలలో ‘జనతా గ్యారేజ్’ ఆల్ టైం రికార్డులను అందుకుంది. వీక్ డే కావడంతో… గురువారం విడుదలైన సినిమాలకు ఓపెనింగ్స్ కాస్త తక్కువగా ఉంటాయి. కానీ, ‘స్టార్’ పవర్ ఏంటో చాటి చెప్పే విధంగా వీక్ డేలోనూ ‘జనతా గ్యారేజ్’ రికార్డులను వేటాడింది. మరో వైపు అటు యుఎస్ ప్రీమియర్స్ తో కూడా ఆల్ టైం జాబితాలో టాప్ 3 స్థానంలో నిలిచి సత్తా చాటింది.

ఓ పక్కన ప్రేక్షకుల నుండి భిన్న స్పందనలు అందుకోవడం యంగ్ టైగర్ అభిమానులకు నిరాశగా మారగా, మరో పక్కన ఇలా ఆల్ టైం రికార్డులు అందుకోవడం కొత్త ఉత్సాహాన్ని పంచుతోంది. అయితే రానున్న రోజుల్లో టాక్ కాస్త పాజిటివ్ గా మారితే, ‘జనతా గ్యారేజ్’ రికార్డులకు ఎలాంటి అడ్డంకులు ఉండకపోవచ్చనేది ట్రేడ్ పండితుల మాట. ప్రస్తుతం మార్కెట్ లో ఎలాంటి చిన్న, పెద్ద సినిమాలు లేకపోవడం కలిసొచ్చే అంశం.