Pawan Kalyan - Chandrababu Naidu - YS Jaganదేశంలో ఎన్నికల నగారా మోగింది. రెండు తెలుగు రాష్ట్రాల పార్లమెంట్ ఎన్నికలతో పాటు ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలు వచ్చే నెల 11న జరగబోతున్నాయి. ఈ క్రమంలో నామినేషన్లకు గట్టిగా రెండు వారాల సమయం కూడా లేదు. ఈ క్రమంలో మొదటి లిస్టు ఎవరు ప్రకటిస్తారనేది చూడాలి. మొదటి ఫేజ్ లోనే ఎన్నికలు జరగడం కేవలం నెల రోజుల సమయం మాత్రమే ఉండటం ఒకరకంగా అన్ని పార్టీలకు షాక్ అనే చెప్పుకోవాలి. తెలుగుదేశం పార్టీ ఇప్పటికే 100 మంది తో లిస్ట్ తయారు చేసిందని సమాచారం.

మరో 30 స్థానాలకు అభ్యర్థులను ఈరోజు కంఫర్మ్ అవుతారు. రేపు లేదా ఎల్లుండి మొదటి లిస్టు ప్రకటించే అవకాశం ఉంది. మరోవైపు వైఎస్సాఆర్ కాంగ్రెస్ కూడా 100 మంది అభ్యర్థుల తో కూడిన లిస్టు తయారుగా ఉందని చెబుతుంది. అయితే ఎప్పుడు విడుదల చేసేది చెప్పడం లేదు. నెల రోజుల లోపే ఎన్నికలు అనే వార్త జనసేన మీద పిడుగు పడినట్టు అయ్యింది. అసలు 175 స్థానాలకు ఆ పార్టీ పోటీ చేస్తుందా అనేది ఇప్పుడు అనుమానంగా మారింది. బీజేపీ, కాంగ్రెస్ పార్టీల సంగతి అయితే ఇక చెప్పక్కర్లేదు.

మొత్తం అన్ని సీట్లలో అభ్యర్థులను పెట్టకపోతే పరువు పోతుందని ఆ పార్టీలు భావిస్తుంది. అయితే అలా చేస్తే ఎన్నికల తరువాత డిపాజిట్లు కోల్పోవడంతో రెండు పార్టీలు పోటీ పడాలి. మరోవైపు వామపక్షాలు పవన్ కళ్యాణ్ తమకు ఎన్ని సీట్లు వదులుతారో అని ఆత్రంగా ఎదురు చూస్తున్నారు. ఒకరకంగా ప్రధాన పార్టీలైన టీడీపీ, వైఎస్సాఆర్ కాంగ్రెస్ తప్ప ఏ పార్టీ కూడా ఎన్నికలకు సిద్ధంగా ఉన్నట్టు కనిపించడం లేదు. దీనితో గత సారి లాగా రెండు పార్టీల మధ్యనే పోటీ ఉండవచ్చు.