JanaSena Pawan Kalyan  CPI Rama Krishna demands Peoples capital in amaravatiవామపక్షాలు జనసేనతో కలిసి అమరావతిని గట్టిగా వ్యతిరేకిస్తున్న సంగతి మన అందరికి తెలిసిందే. అమరావతి కాంక్రీట్ రాజధానిలా తయారు అవుతుందని దానిని ప్రజారాజధానిగా మార్చాలని వారు డిమాండ్ చేస్తూ వస్తున్నారు. అయితే తాజాగా నాలుగేళ్ల నుంచి అమరావతిపై ప్రచారమే తప్ప ఒక్క అడుగూ ముందుకు పడలేదని సిపిఐ కార్యదర్శి కె. రామకృష్ణ వ్యాఖ్యానించారు.

రాజధాని నిర్మా ణానికి కేంద్ర ప్రభుత్వం సహకరిస్తుందని విభజన చట్టంలో ఉన్నా విదేశీ సంస్థల నుంచి రుణాలు తీసుకుంటున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. రాజధాని నిర్మాణం పై చర్చ జరగాలని, భారీ వ్యయం తో నిర్మించడం తగదన్నారు. అయితే ఇప్పుడు అర్ధం కానిది ఏంటంటే అమరావతి నిర్మాణం జరగాలా జరగకూడదా?

ఒకపక్క అమరావతిని రాజధానిగా సెలెక్టు చెయ్యడమే తప్పు అంటూ ఇంకో వైపు నిర్మాణం ఏమి జరగడం లేదు అనడం ఏంటో? కేంద్రప్రభుత్వం సహకరిస్తుందో లేదో రామకృష్ణకు తెలీదా? ఇప్పుడు కామ్రేడ్లు దాని గురించే కదా రోడ్లు ఎక్కి పాదయాత్రలు చేస్తుంది. కామ్రేడ్లలోని అయోమయానికి ఇది నిదర్శనమా?