Janasena Pawan Kalyan - BJP Bandi Sanjay Kumarకమ్యూనిస్ట్ భావజాలం ఉన్న పవన్ కళ్యాణ్ బీజేపీతో పొత్తు ఎలా పెట్టుకున్నారు అనేది ఇప్పటికీ ఆశ్చర్యకరమే. దానిని ఊటంకిస్తూ మిగతా పార్టీ వారు జనసేన ఎద్దేవా చేస్తూ ఉంటారు కూడా. తాజాగా ఆ రెండు పార్టీల మధ్య వైరుధ్యాలు మరోసారి భయపడ్డాయి. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ దీపావళి సంబరాల విషయంలో తెలంగాణ ప్రభుత్వం పై విరుచుకుపడ్డారు.

“హిందువుల మనోభావాలు కాపాడటంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైంది. కెసిఆర్ ప్రభుత్వం ప్రతీసారీ హిందూ పండగలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తోంది.హైకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం బలంగా వాదించకపోవడం వల్లే నిషేధం తెచ్చింది. గౌరవ హైకోర్టు కు ప్రభుత్వం దీపావళి పండగ జరుపుకోవటం విషయంలో తీసుకునే జాగ్రత్తల గురించి విశ్వాసం కల్పించలేకపోయింది, అంటూ విమర్శించారు.

“ప్రతీసారీ హిందువుల పండగలను వివాదాస్పదం చెయ్యడం ఫ్యాషన్ అయిపోయింది. హిందుత్వాన్ని అణచివేయ్యాలని చూసిన మొగలులు,నిజాం కాలగర్భంలో కలిసిపోయారు,భవిష్యత్తులో కేసీఆర్ ప్రభుత్వానికి అదే గతి పడుతుంది,” అంటూ విరుచుకుపడ్డారు. అది అలా ఉంచితే ఆ తరువాత జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలుపుతూ ఇందుకు వ్యతిరేక లైన్ తీసుకున్నారు.

“కరోనా పొంచి ఉన్న కారణంగా ఈ సారి ఆడంబరాలకు దూరంగా ఉందాం. బాణాసంచా పొగమాటున కరోనా పొంచి ఉంది. ఈ సారికి జ్యోతి ప్రజ్వలన, లక్ష్మీదేవి పూజకు పరిమితం అవుదాం. కరోనా దరిచేరకుండా మానవాళిని కాపాడుకుందాం. అలాగే పర్యావరణానికి కూడా మేలు చేసిన వాళ్ళం అవుతాం,” అని చెప్పుకొచ్చారు. ఈ విషయంలో మిత్రులు రెండు పరస్పరవిరుద్ధమైన స్టాండ్ తీసుకోవడం విశేషం.