Pawan-Kalyan Janasena Party Presidentజనసేన అధినేత పవన్ కళ్యాణ్ సహజంగా మైక్ ముందుకు వస్తే ఆగలేరు. పైగా ఇప్పుడు జగన్ తో ఉన్న వైరం కారణంగా ఆయన మరింతగా బుసలు కొడుతున్నారు. పైగా ఏడాది పైగా జగన్ తన సినిమాలను కూడా ఇబ్బంది పడుతున్నారు.

దీని కారణంగా ఆంధ్రప్రదేశ్ లోనే “భీమ్లా నాయక్”కు 20 కోట్ల దాకా నష్టం అంటున్నారు. ఫిబ్రవరిలో పవన్ కళ్యాణ్ రెండు సార్లు బయటకు వచ్చారు. ఒకటి మత్స్యకార సభలో.. అలాగే భీమ్లా నాయక్ ప్రీ-రిలీజ్ ఈవెంట్ లో ఆయన మాట్లాడారు.

రెండు సార్లు జగన్ గురించి మాట్లాడకుండా తనని తాను చాలా వరకు నియంత్రించుకున్నారు. అయితే ప్రభుత్వం మాత్రం తాను అనుకున్నట్టుగానే భీమ్లా నాయక్ ను ఇబ్బంది పెట్టి తీరింది. ఇక ఇప్పుడు పవన్ కళ్యాణ్ టైం. ఈ నెల 14న మంగళగిరి వద్ద జనసేన ఆవిర్భావ సభ జరగబోతుంది.

అప్పుడు ఇప్పటివరకు తనలో అణచుకున్న ఆవేశాన్ని పవన్ కళ్యాణ్ బయటకు వెళ్లగక్కే అవకాశం వస్తుంది. ఒక రకంగా 2024 ఎన్నికలకు ఈ సభలోనే సమరశంఖం పూరుస్తారని జనసేన వర్గాలు అంటున్నాయి. టిక్కెట్ రేట్ల జీవో ఈ నెల 11న (రాధే శ్యామ్) విడుదలకు ముందే వచ్చేస్తుందని అంచనా.. దానితో 14న పవన్ మాట్లాడితే పరిశ్రమలోని వారికి కూడా ఎటువంటి ఇబ్బంది ఉండదు.

గతంలో 2018లో జనసేన ఆవిర్భావ సభలో అప్పట్లో లోకేష్ ని టార్గెట్ చేసి టీడీపీని అనూహ్యంగా దెబ్బ కొట్టారు పవన్. దానిని వాడుకుని జగన్ బలపడ్డారు. ఇప్పుడు జగన్ మీద కూడా అంతే స్థాయిలో విరుచుకుపడితే ఈ సారి టీడీపీ లాభపడే అవకాశం ఉంది.