Pawan-Kalyan Janasena Party Presidentఅనంతపురం జిల్లాలో రైతు భరోసా యాత్ర ప్రారంభించిన పవన్ కళ్యాణ్ మరోసారి వైసీపీ అధినాయకత్వంపై నేరుగా కామెంట్స్ చేసారు. ఇటీవల జగన్ మోహన్ రెడ్డి చేసిన ‘దత్తపుత్రుడు’ కామెంట్స్ సీరియస్ గా తీసుకున్న జనసేన అధినేత, స్ట్రాంగ్ కౌంటర్లు ఇచ్చారు.

ప్రజల పక్షాన నిలబడి మాట్లాడుతున్న తమను సీబీఎన్ దత్తపుత్రుడు అంటే గనుక మేము కూడా మిమ్మల్ని ‘సీబీఐ దత్తపుత్రుడు’ అనాల్సి వస్తుందని, ఎందుకంటే సీబీఐ మీ పార్టీ వాళ్ళని ఎలాగూ దత్తత తీసుకుంటోంది, మరిచిపోవద్దు అంటూ గట్టిగా బదులిచ్చారు.

ఇంకోక్కసారి గనుక నన్ను వాళ్లకు, వీళ్లకు దత్తపుత్రుడు అంటే గనుక సహించేది లేదని, తనలో కూడా సహనం నశించిందని అన్నారు. గత ఎన్నికల సందర్భంలో కూడా టీడీపీకి ‘బీ-టీమ్’ అంటూ ప్రచారం చేసారు, ఏదైనా గట్టిగ మాట్లాడితే ఏడుస్తారని ఊరుకుంటున్నా అంటూ సంయమనం వహించారు.

మీరు ‘బీ-టీమ్’ అంటే నేను మిమ్మల్ని ‘చర్లపల్లి జైలు షటిల్ టీమ్’ అనాల్సి వస్తుంది, ఇక నిర్ణయం మీకే వదిలేస్తున్నా అన్న భావాలను చాలా బలంగా వెల్లడించారు పవన్ కళ్యాణ్. చర్లపల్లి జైలులో 16 నెలల పాటు షటిల్ ఆడుకున్నారు, సుభాష్ చంద్రబోస్, సర్ధార్ వల్లభాయ్ పటేల్ మాదిరి మీరు దేశ సేవ చేసేమి జైలుకు వెళ్ళలేదు.

ఆర్ధిక నేరాలు చేసి జైల్లో కూర్చున్న మీరు నీతులు చెప్పే స్థితిలో లేరు, చెప్పకండి కూడా! నన్ను విమర్శించే నైతికత కూడా లేదు, ఆ స్థాయి కూడా మీది కాదు అంటూ పవన్ కళ్యాణ్ నేరుగా వైసీపీ పెద్ద తలకాయకే గురిపెడుతూ విమర్శలు చేసారు. ఇటీవల జగన్ ఎలా అయితే పేరు ప్రస్తావించకుండా విమర్శించారో, పవన్ కూడా అదే మాదిరి జగన్ పేరెత్తకుండా బదులిచ్చారు.