Janasena Party office Shutdown in Gorantla  Gunturఇటీవలే జరిగిన ఎన్నికలలో జనసేనకు కేవలం ఒక్కే ఒక్క సీటుతో తన ఖాతాను తెరిచింది. తన తొలి ఎన్నికలలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు నిరాశాజనకమైన ఫలితాలు వచ్చాయి. ఆ పార్టీ పేలవమైన ప్రదర్శన తో పాటు పవన్ కళ్యాణ్ తాను పోటీ చేసినా రెండు సీట్లలో లోను ఓడిపోయారు. కేవలం 5% పై చిలుకు ఓటు షేర్ తో అప్పటి ప్రజారాజ్యం పార్టీ కంటే పేలవమైన ప్రదర్శన కనబరిచింది. దీనితో పార్టీ మనుగడ మీదే అనుమానాలు మొదలయ్యాయి.

ఇటువంటి తరుణంలో రెండు తెలుగు రాష్ట్రాలలోని జనసేన కార్యాలయాలు మూతపడుతున్నాయి. ఇప్పటికే హైదరాబాద్ లోని కార్యాలయం మూసి వెయ్యగా, ఇప్పుడు గుంటూరు నగర శివారులోని గోరంట్ల ఇన్నర్‌ రింగ్‌ రోడ్డులో ఏర్పాటు చేసిన జనసేన పార్టీ రాష్ట్ర కార్యాలయం ఖాళీ అయింది. నిర్వహణ భారం వల్ల మూసి వేసినట్టు వార్తలు వస్తున్నాయి. దీనితో జనసైనికులు దిగాలుగా ఉన్నారు. భవన యజమాని ఇప్పటికే టూ-లెట్ బోర్డు పెట్టేయడం గమనార్హం.

బిల్డింగు మీద జనసేన, పవన్ కల్యాణలకు సంబంధించిన పోస్టర్లు ఉండగానే ఆఫీసులకు గానీ, బార్ అండ్ రెస్టారెంట్లకు గానీ అద్దెకు ఇవ్వబడును అని బ్యానర్ కట్టడం వారిని మరింత బాధ పెట్టింది. అయితే తమ పార్టీకి మిగతా పార్టీల లాగా అవినీతి సొమ్ము లేదని దానితో నిర్వహణ భారంగా పరిణమించడం వల్లే పెద్ద పెద్ద భవనాలను వదులుకుంటున్నామని, సొంత భవనము నిర్మాణంలో ఉంది అని, తొందరలోనే అది అందుబాటులోకి వస్తుందని జనసేన నాయకులు అంటున్నారు.