Janasena - Kurnool - office -controversyకర్నూల్ జిల్లాలో జనసేన పార్టీ కార్యాలయంపై అధికార పార్టీ వైసీపీ నాయకులు దౌర్జన్యంగా దాడి చేసి, అక్కడ ఉన్న ఫర్నిచర్ ను ధ్వంసం చేశారని జనసేన కార్యకర్తలు ఆందోళన చేసిన విషయం తెలిసిందే. ఇదంతా వైసీపీ నాయకుల కుట్రలో భాగమే అంటూ స్థానిక వైసీపీ నేతలను ఉద్దేశించి ఘాటు విమర్శలే చేశారు జనసైనికులు.

మరోవైపు వైసీపీ ఏమో… ఇంటి యజమానిని బెదిరించి., జనసేన నేతలు అక్రమంగా ఈ బిల్డింగ్ ను ఆక్రమించి దౌర్జన్యానికి దిగారని చెప్తోంది. ఈ విషయాన్ని వైరల్ చేసే పనిలో ఉంది వైసీపీ సోషల్ మీడియా. పార్టీలోకి చేర్చుకొనే ముందు పూర్వాపరాలను పరిశీలించరా? పార్టీ నేతలు, కార్యకర్తలకు కనీస విలువలు ఉండవా? నేరస్తులను పార్టీలోకి చేర్చుకుని సమాజానికి ఏం సందేశం ఇస్తున్నారు? అని ఇంటి యజమాని అన్నట్లు వైసీపీ సోషల్ మీడియా జనసేనపై తన అక్కసుని వెల్లకక్కుతుంది.

మరోవైపు జనసైనికులు కూడా ‘తగ్గేదేలే’ అనే విధంగా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉన్నారు. వైసీపీ ఇటువంటి విషప్రచారాలకు పెట్టింది పేరనే విధంగా కౌంటర్లతో రెచ్చిపోతున్నారు. పార్టీలో నేరస్తులకు అవకాశాల గురించి మీ పార్టీ జనసేన వైపు వేలెత్తి చూపడం “దెయ్యాలు వేదాలు వల్లించిన చందంగా ఉంది” అంటూ కౌంటర్లు ఇస్తున్నారు.

ఒక నేరస్తుడు., అక్రమార్కుడు పెట్టిన పార్టీలో పని చేస్తున్న మీరు పవన్ పై బురద జల్లితే అది తిరిగి మీ మీదే పడుతుంది తప్ప, జనసేన అధినేతను ప్రశ్నించే నైతికత మీకు లేదని మండి పడుతున్నారు. ఆంధ్రలో ఉన్న రౌడీమూకలు., రాజకీయ ఉన్మాదులలో సగం మంది మీ వైసీపీ పార్టీలోనే ఉన్నారంటూ పదునైన మాటలతో, ట్వీట్లతో విరుచుకుపడుతున్నారు జనసైనికులు.

పవన్ మీద అభిమానంతో పనిచేసేది మేము… జగన్ ఇచ్చే డబ్బులు కోసం పని చేసేది మీరు అంటూ వైసీపీ సోషల్ మీడియా విభాగం వారికి చురకలు వేస్తున్నారు ‘పవర్ స్టార్’ ఫ్యాన్స్.