JanaSena Flag morphed on 2.0 movie Audio Posterక్రియేటివిటీ ప్రదర్శించడానికి… అభిమానం చూపించుకోవడానికి అవధులు లేవని చెప్పడానికి ఈ ఫోటో నిదర్శనంగా నిలుస్తోంది. ‘రోబో 2.0’ ఆడియో విడుదల సందర్భంగా 1000 అడుగుల ఎత్తుపై ప్రదర్శించిన ‘రోబో 2.0’ పోస్టర్ స్థానంలో ‘జనసేన’ జెండా కనిపించడం నెటిజన్లకు నవ్వులను పంచుతోంది.

ఎవరు సృష్టించారో గానీ సోషల్ మీడియాలో ఈ జనసేన పతాకం ఓ వీరస్థాయిలో చక్కర్లు కొడుతోంది. ఈ ఫోటోను చూసిన వారంతా ‘జనసేన’ దుబాయ్ లో కూడా పోటీ చేయొచ్చు అంటూ కామెంట్స్ చేస్తూ హంగామా చేస్తున్నారు. మరి ఇంతకీ ఈ ఫోటోను పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు తిలకించారో లేదో మరి!