దుబాయ్ లో జనసేన జెండా!

JanaSena Flag in Dubaiరెండు తెలుగు రాష్ట్రాలలో సరిగా వ్యవస్థాపన జరగని జనసేన, వచ్చే ఎన్నికలలో ఇంకా పోటీ చేస్తుందో లేదో కూడా తెలియని పరిస్థితి. తెలంగాణాలో కేసీఆర్ కు సహకరిస్తూ పోటీకి దూరంగా ఉండే ఆలోచనలు చేస్తుండగా, ఏపీలో మాత్రం చంద్రబాబుకు వ్యతిరేకంగా పోరాటం చేస్తూ ఎన్నికలలో పోటీ చేయాలని నిర్ణయించుకున్న విషయం తెలిసిందే.

అయితే ఇప్పటివరకు పార్టీకి కామన్ సింబల్ రాకపోవడంతో, రెండు తెలుగు రాష్ట్రాలలో జనసేన పరిస్థితి ఎలా ఉంటుందన్నది ప్రశ్నార్ధకం అయినా, దుబాయ్ లో మాత్రం జనసేన జెండా రెపరెపలాడుతూ దర్శనమిచ్చింది. ప్రస్తుతం దుబాయ్ వేదికగా జరుగుతున్న ఏషియన్ కప్ లో భాగంగా మంగళవారం నాడు ఇండియా – హాంగ్ కాంగ్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో ఓ అభిమాని జనసేన జెండా పట్టుకుని హల్చల్ చేయడం విశేషం.

సచిన్ టెండూల్కర్ వీరాభిమాని అయిన సుధీర్ కు వెనుకగనే జనసేన అభిమాని కూర్చోవడంతో, టీవీలలో పదే పదే పవన్ కళ్యాణ్ ‘జనసేన’ జెండా కనిపించింది. దీంతో స్క్రీన్ షాట్లను తీసి పవన్ కళ్యాణ్ వీరాభిమానులు సోషల్ మీడియాలో వాటిని షేర్ చేసుకుంటున్నారు. దుబాయ్ లో జెండా బాగానే ఉంది గానీ, అంతకంటే ముందు స్థానికంగా పట్టుకునే వాళ్ళు కూడా ఉండాలి కదా…. అది కూడా చూసుకోవాలిగా..!

Follow @mirchi9 for more User Comments
Sahoo-Postponed-–-Who-Gets--AffectedDon't MissSaaho Postponed – Who Gets Affected?The indications were there all along. It seemed like something was off with Saaho. Not...Nara Lokesh's Surprise to TDP Supporters on Social MediaDon't MissNara Lokesh's Surprise to TDP Supporters on Social MediaTDP is touching the right notes in the Social Media after that historical defeat in...Ravi Prakash Reveals His Future PlansDon't MissRavi Prakash Reveals His Future PlansIt is known to our readers that TV9 Former CEO Ravi Prakash is granted bail...Target Atchannaidu Kinjarapu for YSR Congress GovernmentDon't MissTarget Atchennaidu for YSR Congress Government?Pandemonium took place in Andhra Pradesh Assembly after the Opposition Party, TDP has asked Speaker...Prabhas' First Single Psycho Saiyaan Becomes Clubs' FavouriteDon't MissPrabhas' First Becomes Clubs' FavouriteComparatively, while there was a cold reception of 'Psycho Saiyaan' Song in Telugu mainly due...
Mirchi9