Janasena fans fires on comedian aliకమెడియన్ అలీ పొలిటికల్ ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. డిసెంబర్ 28నప్రతిపక్ష నేత వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిను ఎయిర్‌పోర్టులో కలడంతో ఆ పార్టీలో చేరడం ఖాయమని ప్రచారం జరిగింది. ఆయన కూడా ఈ వార్తల్ని కొట్టేపారేయలేదు. తాజగా అలీ వైసీపీలో చేరాలని నిర్ణయానికి వచ్చారట.. ఈ నెల 9న జగన్ సమక్షంలో పార్టీ కండువా కప్పుకోబోతున్నారని తెలుస్తోంది సమాచారం. పార్టీ అవకాశం ఇస్తే వచ్చే ఎన్నికల్లో రాజమండ్రి నుండి పోటీకి కూడా సిద్ధమంటున్నారట అలీ.

అలీ 2014లో కూడా టీడీపీ నుంచి పోటీ చేయాలని ఆశపడ్డారు. కాని అప్పటి రాజకీయ పరిణామాలతో కుదరలేదు. తర్వాత జనసేనలో చేరతారని ప్రచారం జరిగింది. పవన్‌తో కలిసి నెల్లూరులో జరిగిన రొట్టెల పండుగకు వెళ్లడంతో.. జనసేన తరపున పోటీ చేస్తారని ఊహాగానాలు వినిపించాయి. పవన్ కళ్యాణ్ అలీ చాలా క్లోజ్ కావడంతో ఆయన జనసేనలో చేరడం ఖాయమని అభిమానులు అనుకున్నారు. దీనితో పవన్ అభిమానులు కంగుతిని సోషల్ మీడియాలో అలీ చేసింది నమ్మక ద్రోహమంటూ విరుచుకు పడుతున్నారు.

అయితే గతంలో చిరంజీవి కాంగ్రెస్ లో ఉండగా ఆయనకు వ్యతిరేకంగా పవన్ టీడీపీకి మద్దతు ఇవ్వలేదా? సొంత అన్ననే విభేదించి వచ్చా అని చాలా సార్లు పవన్ కళ్యాణే చెప్పారు కదా? పవన్ కళ్యాణ్ సొంత అన్ననే విబేధించొచ్చుగానీ అలీ తన ఫ్రెండ్ ని కాదని వేరే పార్టీలో చేరకూడదా? సొంత అక్కాతమ్ములైన బాలయ్య, పురంధేశ్వరి వేరు వేరు పార్టీలలో లేరా? సొంత ఫ్యామిలీ వారే ఒకరి మీద ఒకరే పోటీ చేసిన సందర్భాలు ఉన్నాయి. రాజకీయం అంటే పూర్తిగా తెలిసిన వారెవరూ దీనిని తప్పు పట్టరు. రాజకీయాలకు కొత్త కాబట్టే పవన్ ఫ్యాన్స్ కు ఇది కొత్త అనిపించొచ్చు.