Janasena and BJP Poor - Show in MPTC Elections -2020ఆంధ్రప్రదేశ్ లో పంచాయితీ ఎన్నికలు జరుగుతున్నాయి. పార్టీ గుర్తుల మీద జరగని ఎన్నికలు కావడంతో ఏ పార్టీ లెక్కలు ఆ పార్టీవి అన్నట్టు ఉన్నాయి. అయితే జనసేన – బీజేపీ కలిసి మొట్టమొదటి సారిగా పోటీ చేసిన ఈ ఎన్నికలలో పెద్దగా ప్రభావం చుపించాలేకపోయాయి అనే చెప్పుకోవాలి. గ్రామ స్థాయిలో నిర్మాణం లేకపోవడమే ఇందుకు కారణం.

అయితే వస్తున్న ఫలితాల మీద జనసేనలో సరైన సమీక్ష జరుగుతుందా అంటే అనుమానమే. ఆ పార్టీ నాయకత్వం తమకు అంత శాతం ఓట్లు వచ్చాయి ఇంత శాతం ఓట్లు వచ్చాయి అని చెప్పుకుని సరిపెడుతుంది. పార్టీ కార్యకర్తల పరిస్థితి ఇంకోలా ఉంది. వైఎస్సార్ కాంగ్రెస్ విడుదల చేసిన లిస్టులను ప్రామాణికంగా తీసుకుంటున్నట్టుగా కనిపిస్తున్నారు.

ఆ లిస్టుల జనసేన – బీజేపీలు అట్టడుగున ఉన్నా దానిని పట్టించుకోకుండా తెలుగుదేశం పార్టీ దెబ్బతింది అని సంబరాలు జరుపుకుంటున్నారు. ఆ రకంగా వైఎస్సార్ కాంగ్రెస్ లెక్కలు రైట్ అని ఒప్పుకోవడం అదే సమయంలో మొదటి స్థానం మీద ఆశ వదిలేసుకున్నారు అనే మెసేజ్ ప్రజలకు పంపుతున్నారు.

అదంతా పక్కన పెడితే సొంత పార్టీకి వస్తున్న దారుణమైన ఫలితాల గురించి చర్చ అనేది జరగడం లేదు… పూర్తిగా నిర్లిప్తతతో ఉన్న పార్టీ నాయకత్వం మీద ఆ దిశగా ఒత్తిడి కూడా తీసుకుని రాలేకపోతున్నారు. ఇదే వైఖరి కొనసాగిస్తే పార్టీ గుర్తు మీద జరిగే మునిసిపల్, ఎంపీటీసి, జెడ్పీటీసీ ఎన్నికలలో ఘోరమైన ఫలితాలు చూడాల్సి రావొచ్చు.