Please-Be-Responsible,-Pawan-Kalyan!తెలంగాణా రాష్ట్ర నాలుగో ఆవిర్భావ దినోత్సవ సంబరాలను పురస్కరించుకుని ‘జనసేన’ అధినేత పవన్ కళ్యాణ్ ఓ ప్రెస్ నోట్ విడుదల చేసారు. “ఆరున్నర దశాబ్దాల పోరాటంతో సిద్ధించిన ఈ రాష్ట్రం సుసంపన్నం కావాలంటే అందరూ కలసికట్టుగా పని చేయాలని” గొప్ప సందేశంతో కూడిన పిలుపునిచ్చారు. నిజమే… ఏ రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా అందరూ కలిసికట్టుగా ఉంటే అది సాధ్యమవుతుంది. రాజకీయ ప్రయోజనలా రీత్యా అన్ని విషయాలలో ఇది అసాధ్యం కాబట్టి, కనీసం రాష్ట్రానికి కీలకమైన అంశాలలో అయినా కలిసికట్టుగా ఉండాల్సిన ఆవశ్యకత ఉంది.

తెలంగాణా రాష్ట్రానికి అంత గొప్ప సందేశం ఇచ్చిన పవన్ కళ్యాణ్ గారు, ఏపీకి మాత్రం ఎలాంటి సందేశం ఇవ్వలేకపోయారు. ఎందుకంటే… ఏపీలో పవన్ కు అన్నీ సందేహాలే! ప్రత్యర్ధి రాజకీయ నాయకుడిగా ఉన్న అధికార ప్రభుత్వాన్ని విమర్శించే హక్కు పవన్ కు ఉండవచ్చు గానీ, ప్రత్యేక హోదా వంటి కీలకమైన అంశాలలో కలిసికట్టుగా పోరాడితేనే కేంద్రం మెడలు వంచగలమన్న నీతి సూత్రాన్ని మరిచారు. కలిసికట్టుగా పక్కన పెడితే, రాష్ట్రానికి ద్రోహం చేసేలా, కేంద్రానికి అనుకూలంగా వ్యవహరిస్తుండడం మరింత విస్తుపోయే అంశం. ఇంతలా చేస్తున్నా… తనను ఎవరూ అనుమానించకూడదు… విమర్శించకూడదు… మరి!