Janasena Pawan Kalyan -condemns alliance with tdpపశ్చిమ గోదావరి జిల్లా పవన్ కళ్యాణ్ సొంత జిల్లా. ఉద్యోగరీత్యా వారి కుటుంబం రాష్ట్రమంతా తిరిగినా పవన్ కళ్యాణ్ తండ్రి గారు, తల్లి గారు జన్మించింది ఈ జిల్లాలోనే. అయితే పవన్ కళ్యాణ్ కు ఇప్పుడు ఈ జిల్లా మీద కోపమొచ్చిందట. కాబట్టి ఈ జిల్లా నుండి పోటీ చెయ్యడానికి ససేమిరా అంటున్నారట. మనకు ఉన్న సమాచారం బట్టి ఉత్తరాంధ్ర నుంచే బరిలోకి దిగే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. ఉత్తరాంధ్ర – తూర్పుగోదావరి జిల్లాలపై ప్రభావం ఉండే నియోజకవర్గాన్ని ఎంచుకునే దిశగా జనసేనాని ఆలోచన చేస్తున్నారనే టాక్ వినిపిస్తోంది.

గాజువాక లేదా తూర్పుగోదావరి జిల్లాలోని ఒక సీటు నుంచి జనసేనాని బరిలోకి దిగుతారనే చర్చ పొలిటికల్ సర్కిల్‌లో సాగుతోంది. పశ్చిమ గోదావరి నుండి పోటీ చెయ్యమని ఒత్తిడి ఉన్నా పవన్ కళ్యాణ్ ఇంట్రెస్ట్ చూపించడం లేదంట. గతంలో జిల్లా లోని పాలకొల్లు నుండి 2009 ఎన్నికలలో చిరంజీవి పోటీ చేసి ఓడిపోయారు. కాపు సామాజిక వర్గం ఎక్కువగా ఉండే నియోజకవర్గమే అయినా ఓటమి తప్పలేదు. దీనితో జిల్లా ను నమ్మలేం అని పవన్ కళ్యాణ్ భావన అని చెబుతున్నారు.

మరో వైపు ఆయన గాజువాక నుండే పోటీ చేసే అవకాశాలు ఎక్కువ ఉన్నాయని తెలుస్తుంది. స్క్రీనింగ్ కమిటీ కూడా గాజువాక నుంచి పోటీకే మొగ్గు చూపుతోందన్న సమాచారం ఉంది. రాష్ట్రంలో లక్ష సభ్యత్వాలతో గాజువాక నియోజకవర్గం మొదటి స్థానంలో నిలవడంతో పార్టీ అధినేతను అక్కడి నుంచే పోటీకి దింపాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. పవన్ కల్యాణ్ పోటీచేసే సీటుపై వారం రోజుల్లోగా స్పష్టత వచ్చే ఛాన్స్ ఉందంటున్నారు. సీటు ఖరారు కాగానే అక్కడ జనసేన ఒక భారీ బహిరంగసభ పెట్టే అవకాశం ఉందంట.