Can't Talk in Jagan's Language - Pawan Kalyanడిసెంబర్ లో వచ్చిన తెలంగాణ ఎన్నికలలో జనసేన పోటీ చెయ్యలేదు. అనుకున్న సమయం కంటే ముందే ఎన్నికలు రావడం వల్ల తాము ప్రిపేర్ అవ్వడానికి టైమ్ సరిపోలేదని, ఈ సారి వచ్చే పార్లమెంట్ ఎన్నికలలో తప్పకుండా పోటీ చేస్తామని చెప్పి జనసేన పోటీ నుండి తప్పుకుంది. అందుకోసం ఇప్పటి నుండే పార్టీ నిర్మాణం చేపడతా అని పవన్ కళ్యాణ్ తెలంగాణలోని పార్టీ అభిమానులకు వాగ్దానం చేశారు. తెలంగాణ ఎన్నికల ఫలితాలు వచ్చి రెండు నెలలు కావొస్తుంది.

పార్లమెంట్ ఎన్నికలకు కేవలం రెండున్నర నెలల సమయం మాత్రమే ఉంది. అయితే ఇప్పటి వరకు తెలంగాణాలో జనసేన పార్టీ నిర్మాణం కోసం పవన్ కళ్యాణ్ చేసింది ఏమీ లేదు. కనీసం పార్టీని తెలంగాణాలో బలోపేతం చెయ్యడానికి ఒక్క అంతర్గత మీటింగు కూడా పెట్టుకున్నదీ లేదు. దీని బట్టి ఇక తెలంగాణ మీద పార్టీ ఆశలు వదిలేసుకున్నట్టే అని మనకు అర్ధం అవుతుంది. పైగా ఎన్నికల వరకు పూర్తిస్థాయిలో ఆంధ్రప్రదేశ్ లో ఉండి పార్టీని పటిష్టపరుస్తా అని పవన్ కళ్యాణ్ ప్రకటించారు.

అన్నట్టుగానే ఎక్కువ కాలం అమరావతిలోనే గడుపుతున్నారు పవన్ కళ్యాణ్. అయితే తెలంగాణలోని పార్టీ క్యాడర్ అంతా పవన్ కళ్యాణ్ చిన్న చూపుపై పూర్తిగా నిరాశగా ఉన్నారు. తెలంగాణలో జనసేన ప్రభావం చూపించలేకపోవడం ఒక ఎత్తు అయితే అసలు కనీసం ఆ దిశగా ప్రయత్నం కూడా చెయ్యకపోవడం వారిని నిరాశ పరుస్తుంది. నియోజకవర్గాలలో పార్టీకి మద్దతుగా ఉన్న చిన్నా చితకా నాయకులు కూడా జనసేనాని సీరియస్ గా లేకపోవడంతో తమ దారి తాము చూసుకున్నారు.

ఇటీవలే తెలంగాణాలో జరిగిన పంచాయితీ ఎన్నికలలో చాలా చోట్ల జనసేన నాయకులు వివిధ పార్టీల నుండి పోటీ చెయ్యడం కనిపించింది. వారు నిన్న మొన్నటి దాకా జనసేన జండాలు పట్టుకుని తిరిగిన వారే అట. అయితే అభిమానం చంపుకోలేని కొందరు అభిమానుల మాత్రం సోషల్ మీడియాలో జనసేన పార్టీకి ఆంధ్రప్రదేశ్ అంశాల పై ప్రచారం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లో ఏదో రకంగా (సొంతంగా కాకపోయినా కర్ణాటక లాగా) అధికారంలోకి వస్తే తీరిక దొరికి తమ నాయకుడు తెలంగాణ మీద దృష్టి పెడతారని వారి ఆశ.