Jana-Sena-Pawan-Kalyan-Politicsతాను ఎదురుకున్న మొదటి ఎన్నికలలో జనసేనకు కేవలం ఒక్కే ఒక్క సీటుతో తన ఖాతాను తెరిచింది. తన తొలి ఎన్నికలలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు నిరాశాజనకమైన ఫలితాలు వచ్చాయి. ఆ పార్టీ పేలవమైన ప్రదర్శన తో పాటు పవన్ కళ్యాణ్ తాను పోటీ చేసినా రెండు సీట్లలో లోను ఓడిపోయారు. కేవలం 5% పై చిలుకు ఓటు షేర్ తో అప్పటి ప్రజారాజ్యం పార్టీ కంటే పేలవమైన ప్రదర్శన కనబరిచింది. దీనితో పార్టీ మనుగడ మీదే అనుమానాలు మొదలయ్యాయి.

పవన్ కళ్యాణ్ ఓటమి పై విశ్లేషణ అంటూ నాలుగు రోజులు మంగళగిరి ఆఫీసులో హడావిడి చేసి మళ్ళీ హైదరాబాద్ వెళ్లిపోయారు. ఇప్పుడు ఆ పార్టీ ఊసే ఎక్కడా లేదు. ఇది ఇలా ఉండగా జనసేన అభిమానులు సోషల్ మీడియాలో ఏం చేస్తున్నారో ఎందుకు చేస్తున్నారో అర్ధం కాకుండా చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఓడిపోవడం గురించి గానీ జనసేన పేలవమైన ప్రదర్శన గురించి గానీ వారికి కించెత్తు కూడా బాధ ఉన్నట్టు కనిపించడం లేదు. అది లేకపోగా వారు టీడీపీ ఓటమిని ఎంజాయ్ చేస్తున్నారు.

అధికార పక్షం టీడీపీని అసెంబ్లీలో అవమానిస్తున్నా చంద్రబాబుకు సెక్యూరిటీ తగ్గించి ఇబ్బంది పెడుతుంటే వాటిని చూసి ఆనందిస్తున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ చేస్తున్న పనులను ఎంకరేజ్ చేస్తున్నారు. టీడీపీకి, జనసేనకు స్నేహం ఏమీ లేదు కాబట్టి వారు అలా చెయ్యడం తప్పేమీ కాదు. అయితే ఓటమి మీద కించెత్తు బాధకుడా లేకపోవడం ఓటమి మీద ఆలోచన కూడా చెయ్యకపోగా సోషల్ మీడియాలో చెలాకిగా ఉండటం చూస్తే వీరికి రాజకీయాలు ఎందుకు అని సామాన్యులకు అనిపిస్తుంది. అది జనసేనకే ప్రమాదం.