jana-sena-pawan-kalyan-latestజనసేన అధినేత పవన్ కళ్యాణ్ తమ పార్టీ నుండి మొదటి అభ్యర్థిని ప్రకటించారు. తూర్పు గోదావరి జిల్లాలోని ముమిడివరం నియోజకవర్గం నుండి పితాని బాలకృష్ణను పార్టీ అభ్యర్థిగా ప్రకటించారు. శెట్టి బలిజ కులానికి చెందిన పితాని బాలకృష్ణకు టిక్కెట్టు ఇవ్వడమంటే పాయకరావు పేటలో ఫ్లెక్సీ కడుతూ చనిపోయిన అదే సామాజిక వర్గానికి చెందిన తోలెం నాగరాజుకు ఆత్మకు శాంతి కలిగించడమే అని పవన్ కళ్యాణ్ అన్నారు.

అయితే పవన్ కళ్యాణ్ చేసిన ఈ వ్యాఖ్య సోషల్ మీడియాలో వివాదానికి దారి తీసింది. కుల రాజకీయాలు చేయ్యను అని చెప్పుకునే పవన్ కళ్యాణ్ ఇటువంటి మాటలు చెప్పడం ఏంటో? చనిపోయిన అభిమానికి ఏదైనా సాయం చెయ్యాలంటే ఆ కుటుంబానికి చెయ్యాలి… లేకపోతే ఆ కుటుంబంలోని వారికి టిక్కెట్టు ఇవ్వాలి.

ఒకే కులంలో ఆ అభిమాని, పితాని బాలకృష్ణ పుట్టడం తప్ప ఆ అభిమానికి జరిగిన మేలు ఏంటి? ఆ మాటకు వస్తే కాపు కులానికి చెందిన పవన్ కళ్యాణ్, చిరంజీవి వంటి వారు ఈ రోజు సమాజంలో ఉన్నత స్థాయిలో ఉంటే ఆ కులంలోని వారు బాగుపడినట్టేనా? తోలెం నాగరాజు ఆత్మకు శాంతి వారి కుటుంబానికి ఆదుకున్నప్పుడే.