Jana-sena-Pawan-Kalyan-Latest-Press-Meetజనసేన అధినేత పవన్ కళ్యాణ్ కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టాకా మొట్టమొదటి సారి మీడియా ముందుకు వచ్చారు. ఈ సందర్భంగా ఆయన కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసారు. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేకహోదా కోసం ఈ నెల 21 నుంచీ న్యూఢిల్లీ లోని జంతర్ మంతర్ లో ఆమరణ నిరాహారదీక్ష పవన్ కళ్యాణ్ అమరణనిరాహార దీక్ష చేస్తున్నట్టు పుకార్లును ఆయన కొట్టి పారేశారు.

“రోడ్ల మీదకు వస్తే సమస్యలు పరిష్కారం అవుతాయి అనేది వట్టి మాట. అటువంటి రాజకీయాలు చెయ్యడం నాకు తెలీదు. అయితే చివరి ప్రయత్నంగానే అటువంటివి చెయ్యవచ్చు,” అని ఆయన అన్నారు. ఇదే సమయంలో టీడీపీ, బీజేపీలకు ఇప్పటికి జనసేన మద్దత్తు ఇస్తుందా అంటే ఆయన ఈ విధంగా స్పందించారు.

“మద్దత్తు ఇవ్వడానికి నాకు ఎమ్మెల్యేలు, ఎంపీలు లేరు. గత ఎన్నికల్లో పోటీ చేసి ఉంటే జనసేన గొంతును పార్లమెంట్ లో బలంగా వినిపించిఉండేవాడిని… ఆ అవకాశాన్ని కోల్పోయాననే బాధ నాకుంది,” అని ఆయన అన్నారు. 2019లో పొత్తుల విషయం అడగగా రాజకీయాలకు ఇది సమయం కాదన్నారు.