జనసేన ఆధ్వర్యంలో ఏపీ రాష్ట్రం పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులో ఫిల్మ్ఇన్స్టిట్యూట్ను ఏర్పాటు చేయనున్నట్లు జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్ వెల్లడించారు. సినీ రంగ ప్రముఖులు అల్లు రామలింగయ్య, దాసరి నారాయణరావు, కోడి రామకృష్ణ తదితరులు ఎందరో ఇక్కడి నుంచే పరిశ్రమకు వచ్చి రాణించారని గుర్తుచేశారు. ఈ ఇన్స్టిట్యూట్కు ఎస్వీ రంగారావు పేరు పెట్టనున్నట్లు ప్రకటించారు. మాజీ మంత్రి చేగొండి హరిరామజోగయ్య దీనికి ఛైర్మన్‌గా వ్యవహరిస్తారని చెప్పారు.
రాజా వన్నెంరెడ్డి, బన్నీ వాసుల ఆధ్వర్యంలో ఇది నడుస్తుందని పవన్ కళ్యాణ్ ప్రకటించారు. పాలకొల్లు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో నటన, దర్శకత్వం విభాగాల్లో శిక్షణ ఇస్తామని చెప్పారు. ఒక రాజకీయ పార్టీ ఆధ్వర్యంలో ఫిల్మ్‌ఇన్‌స్టిట్యూట్ పెట్టడం ఏంటి అని సర్వత్రా దీనిపై చర్చ జరుగుతుంది. అయితే పాలకొల్లులో జరుగుతున్న చర్చ ప్రకారం ఈ ఫిల్మ్‌ఇన్‌స్టిట్యూట్ కు జనసేన పార్టీకి ఎటువంటి సంబంధం లేదు. బన్నీ వాసు కొందరి స్నేహితులు కలిసి ఇది పెడుతున్నారు.
బన్నీ వాసుతో ఉన్న స్నేహం, పార్టీకి ఆయన చేసిన సేవల వల్ల పవన్ కళ్యాణ్ జనసేన పేరు వాడుకోడానికి ఒప్పుకున్నారు. బన్నీ వాసు ఇటీవలే జరిగిన ఎన్నికలలో పాలకొల్లు టిక్కెట్ ఆశించారు అయితే కొన్ని కారణాల వల్ల పవన్ కళ్యాణ్ ఇవ్వలేకపోయారు. జనసేన కు కూడా కొంచెం మంచి పేరు వస్తుంది కదా అని పవన్ కళ్యాణ్ భావించారు. ఇదే సమయంలో జనసైనికులకు మాత్రం కొంత అదనపు డిస్కౌంట్ ఇవ్వనున్నట్టు సమాచారం. ఈ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ పవన్ కళ్యాణ్ స్వయంగా ప్రారంభించే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది.