Pawan Kalyan, Pawan Kalyan Elections 2019, Pawan Kalyan Tirupati Elections 2019, Jana Sena Pawan Kalyan Elections 2019, Pawan Kalyan Contesting Elections 2019 Tirupatiపవన్ కల్యాణ్ తిరుపతిలో సభ నిర్వహించాలని తీసుకున్న నిర్ణయం వెనుక భారీ వ్యూహమే ఉందని జనసేన వర్గాలు చెబుతున్నాయి. గతంలో సినీ తారలు రాజకీయ రంగ ప్రవేశం చేసిన వేళ, తొలిసారి ఎన్నికల్లో పోటీ పడ్డప్పుడు తిరుపతినే ఎంచుకున్నారని, ఇప్పుడు పవన్ సైతం అదే దారిలో నడుస్తున్నారని జనసేన ప్రతినిధులు చెబుతున్నారు.

గత రెండు రోజులుగా తిరుమలలో మకాం వేసిన పవన్, పలువురు సన్నిహితులు, తిరుపతిలోని తన అభిమాన సంఘాల నేతలను పిలిపించుకుని కీలక చర్చలు జరిపిన సంగతి తెలిసిందే. తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గంలోని మొత్తం ఓటర్ల జాబితాను తెప్పించుకున్న ఆయన, ఏ సామాజిక వర్గానికి ఎన్ని ఓట్లున్నాయన్న దగ్గర నుంచి యువత ఓట్లు, స్త్రీ, పురుషుల ఓట్లు, రాజకీయంగా బలంగా ఉన్న వర్గాలేంటి? ఎన్నికల్లో కులాల బలాబలాలు వంటి అంశాలన్నింటిపైనా సమగ్ర చర్చలు జరిపారు.

దీంతో పవన్ కు సన్నిహితంగా ఉన్న నాయకుల్లో తమ నేత తిరుపతి నుంచి పోటీ చేస్తారేమోనన్న ఆశలు రేగుతున్నాయి. కాగా, గతంలో ఎన్టీఆర్, ఆపై చిరంజీవి వంటి వారు తిరుపతి నుంచి పార్టీని ప్రకటించి, పోటీపడి విజయం సాధించిన సంగతి తెలిసిందే. దీంతో రాజకీయాల్లోకి రావాలని పవన్ భావిస్తే, తిరుపతినే ఎంచుకోవచ్చన్న వాదనకు బలం చేకూరుతోందని జనసేన వర్గాలు చెబుతున్నాయి.