Jana Sena - BJP Panchayat Electionsఆంధ్రప్రదేశ్ లో పంచాయతీ ఎన్నికల నగారా మోగింది. ఎన్నికల నిర్వహణ విషయంలో నిమ్మగడ్డ రమేష్ కుమార్ తన పంతం నెగ్గించుకున్నారు. చెప్పిన విధంగానే తాను పదవి నుండి దిగిపోయేలోపు ఎన్నికలు నిర్వహిస్తున్నారు. దానిని ఆపడానికి ప్రభుత్వం సుప్రీం దాకా వెళ్లి అభాసుపాలు అయ్యింది. సహజంగా స్థానిక ఎన్నికలలో అధికార పక్షానికి ఎడ్జ్ ఉంటుంది.

పైగా వైఎస్సార్ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి కేవలం రెండేళ్లు మాత్రమే అయ్యింది. ఇంకో మూడేళ్ళు ఇదే ప్రభుత్వం ఉండటంతో సహజంగా ప్రజలు మార్పు కోరుకోరు. అయితే ఈ ఎన్నికలలో ప్రతిపక్ష పార్టీలు తమ ఉనికిని కాపాడుకోవడానికి ప్రయత్నిస్తాయి. ఈ ఎన్నికల పై ప్రధాన ప్రతిపక్ష పార్టీ టీడీపీ ఎప్పుడో కసరత్తు మొదలుపెట్టింది.

అయితే బీజేపీ-జనసేన ల పరిస్థితి ఏంటి అనేది చూడాలి. ఈ రెండు పార్టీలకు గ్రామా స్థాయిలో పార్టీ నిర్మాణం లేదు. బీజేపీ కనీసం 2019 ఎన్నికల తరువాత ఎంతో కొంత ఆ దిశగా ప్రయత్నాలు చేసింది. అయితే జనసేన 2019 ఎన్నికల సందర్భంగా ఎటువంటి అయోమయంలో ఉందో ఇప్పుడూ అదే అయోమయంలో ఉంది.

పార్టీని సంస్థాగతంగా నిర్మించడంలో ఎటువంటి ప్రయత్నం చెయ్యలేదు. పైగా ఈసారి సీట్ల పంపకం తకరారు కూడా ఉంటుంది. రెండేళ్లలో ప్రజలలోకి వెళ్ళింది లేదు అదే సమయంలో ఈ సారి గత ఓటమి తాలుక ఇబ్బంది కూడా ఉంటుంది. ఇన్ని సమస్యల మధ్య జనసేన ఎలా రాణిస్తుందో చూడాలి.