Pawan-Kalyan's-Seriousness-in-Doubt---JanaSenaవిశాఖపట్నం జిల్లా పెందుర్తి మండలం చిన్నముసిడివాడ గ్రామంలో పెందుర్తి అభ్యర్థి చింతలపూడి వెంకటరామయ్య ఆధ్వర్యంలో జనసేన పార్టీ ఆత్మీయ సమావేశం జరిగింది. జనసేన పార్టీకి ప్రజల్లో మంచి ఆదరణ ఉందని, 70 సీట్లకి తక్కువ గెలవమని చింతలపూడి వెంకటరామయ్య ధీమా వ్యక్తం చెయ్యడం గమనార్హం. ఒకవేళ నిజంగా అదే జరిగితే రాష్ట్ర రాజకీయ ముఖచిత్రంలో అదో సరికొత్త సంచలనం అనడంలో ఎలాంటి సందేహం లేదు.

అటువంటి సందర్భంలో టీడీపీ మూడవ స్థానానికి పడిపోతే చంద్రబాబు జగన్ ను నిలువరించేందుకు ఖచ్చితంగా జనసేనకు మద్దతు ఇచ్చి పవన్ కళ్యాణ్ ను సీఎం చేస్తారు. ఒకవేళ వైఎస్సార్ కాంగ్రెస్ మూడవ స్థానంలో ఉన్నా పవన్ కళ్యాణ్ ను మద్దతు ఇవ్వడానికి ఏ మాత్రం సంకోచించదు. అయితే జనసేనపై ఎవరికీ అటువంటి అంచనాలు లేవు. పవన్ కళ్యాణ్ తాను పోటీ చేసిన రెండు సీట్లలో గెలుస్తారా అంటే కూడా చెప్పలేని పరిస్థితి. జనసేన రెండంకెల సీట్లు సాధిస్తే ఆ పార్టీకి మంచి ఫలితాలు వచ్చినట్టే.

అలా జరగని పక్షంలో మాత్రం ఆ పార్టీ మనుగడే కష్టం. పవన్ కళ్యాణ్ తన రెండు సీట్లలో గెలవకపోతే ఆయనపై తిరిగి సినిమాలు చెయ్యాలనే ఒత్తిడి కూడా పెరుగుతుంది. ఈ క్రమంలో జనసేన భవిష్యత్తు ఎలా ఉండబోతుంది అనేది వేచి చూడాలి. కౌంటింగ్ లోపు పార్టీపై నమ్మకం సన్నగిల్లితే అది ఇంకా ప్రమాదం. కౌంటింగ్ కు కనీసం ఏజెంట్లు కూడా వెళ్లారు. పవన్ కళ్యాణ్ మౌనం వీడి కార్యకర్తలను మధ్య మధ్యలో ఉత్తేజపరుస్తూ ఉండాలి. లేకపోతే అసలు కే ఎసరు రావడం ఖాయం.