దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికలలో అధికార పార్టీకి షాక్ ఇచ్చిన బీజేపీ నాగార్జున సాగర్ ఉపఎన్నికకు సిద్ధం అవుతుంది. టీఆర్ఎస్ నాగార్జున సాగర్ ఎమ్మెల్యే నోముల న‌ర్సింహ‌య్య మృతితో తెలంగాణ‌లో మ‌రో ఉప ఎన్నిక అనివార్యం కానుంది. ఈ ఉపఎన్నిక కోసం బీజేపీ కాంగ్రెస్ కు చెందిన మాజీ మంత్రి జానారెడ్డి పై గేలం వేసింది.

ఆయనను పార్టీలో చేర్చుకుని నాగార్జున సాగర్ బరిలో దింపాలని ప్లాన్ చేసింది అయితే అది కుదరనట్టుగా కనిపిస్తుంది. జానారెడ్డి ఉన్నఫళంగా మళ్ళీ కాంగ్రెస్ లో యాక్టీవ్ అయ్యారు. ఈరోజు నోముల న‌ర్సింహ‌య్య నివాసానికి వెళ్లి ఆ కుటుంబాన్ని పరామర్శించారు. దీనితో ఆయనను కాంగ్రెస్ బరిలో దింపొచ్చు అని అంతా అనుకుంటున్నారు.

2009లో నాగార్జునసాగర్ నియోజకవర్గం ఏర్పడ్డాక జరిగిన మూడు ఎన్నికలలో జానా రెండు సార్లు గెలిచారు. 2018లోనే మొదటి సారిగా ఓడిపోయారు. అప్పటినుండి ఆయన కాంగ్రెస్ తో అంటీముట్టనట్టుగా వ్యవహరిస్తున్నారు. 2018 ఎన్నికలలో నాగార్జున సాగర్ లో బీజేపీ కేవలం 1.48% ఓట్లు ద‌క్కించుకోవ‌డం గ‌మ‌నార్హం.

సరైన అభ్యర్థి లేక బీజేపీ అక్కడ సతమతం అవుతుంది. తెరాస నోముల న‌ర్సింహ‌య్య కుటుంబసభ్యులకే సీటు ఇచ్చే అవకాశం ఉంటుంది. ఈ ఉపఎన్నికలో తమ అభ్యర్థిని అఖండ మెజారిటీతో గెలిపించుకుని బీజేపీది బలం కాదు వాపు అని తెరాస నిరూపించాలని అంటుకుంటుంది.