James Cameron's dreams inspire his films‘టెర్మినేటర్’ సినిమా ఆర్నాల్ట్ ష్క్వార్జ్ నెగ్గర్ కు హాలీవుడ్ లో సూపర్ స్టార్ హోదాను తెచ్చింది. ‘అవతార్’ శామ్ వర్తింగ్టన్ కు స్టార్ హోదా ఇచ్చింది. ఈ రెండు సినిమాల్లో హీరో పాత్రలు భూమికి సంబంధించని, అతీంద్రియ శక్తులు కలిగిన పాత్రలన్న సంగతి తెలిసిందే. ఈ రెండు సినిమాలు అప్పటివరకు ఉన్న రికార్డులన్నింటినీ బద్దలు కొట్టి సరికొత్త చరిత్రను సృష్టించాయి. అయితే ఈ పాత్రల రూపకల్పన వెనుక నిజమైన ‘కలలు’ ఉన్నాయని ఆ సినిమాల రూపకర్త జేమ్స్ కేమరాన్ తెలిపారు.

ఓ రోజు రాత్రి ఎర్రని మంటల్లో అస్థిపంజరం కాలుతున్నట్టు కల వచ్చిందని, ఆ కల తన బుర్రను వదల్లేదని, దాని స్పూర్తిగా కధను డెవలెప్ చేసి ‘టెర్మినేటర్’ సినిమా రూపొందించానని అన్నారు. ‘అవతార్’ కథకు కూడా అలాంటి నేపథ్యమే ఉందని, ఈ కథకు మాత్రం తన కాలేజీ రోజుల్లోనే బీజం పడిందని తెలిపారు. తన కలల్లో దట్టమైన అడవులు వస్తుండేవని, వాటినే తాను ‘అవతార్’ లో చూపించానని చెప్పిన జేమ్స్ కెమరూన్, ఈ సినిమాకు నాలుగు సీక్వెల్స్ రూపొందించే పనిలో పడ్డ విషయం తెలిసిందే.