Jamba-Lakidi-Pamba-Official-Teaserఈవీవీ సత్యనారాయణ గారి అద్భుతమైన సినిమాలలో “జంబలకిడిపంబ” ఒక మచ్చుతునక. ఆడవారు మగవారిగా, మగవారు ఆడవారిగా ప్రవర్తించే ఈ సినిమా అప్పట్లో ఓ సంచలనం, నిజానికి ఇప్పటికీ కూడా! అంతటి సంచలనం సృష్టించిన ఈ సినిమా టైటిల్ “జంబలకిడిపంబ”తో తాజాగా మరో సినిమా సిద్ధమైంది.

కమెడియన్ శ్రీనివాస్ రెడ్డి ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా టీజర్ ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. వినోదభరితంగా కనిపిస్తోన్న ఈ టీజర్ లో గోపి సుందర్ బ్యాక్ గ్రౌండ్ సంగీతం హైలైట్ గా నిలిచింది. ఈవీవీ ‘జంబలకిడిపంబ’తో ఎక్కడా సంబంధం లేకపోవడం అనేది ప్లస్ గా, మైనస్ గా మారుతుందో చూడాలి.

సూపర్ హిట్ టైటిల్ కావడంతో, అదే టైటిల్ తో వస్తోన్న సినిమా అంటే ఖచ్చితంగా అంత కామెడీని ఎక్స్ పెక్ట్ చేసారు. ఈవీవీ అందించినంత వినోదం కాకపోయినా, అందులో సగం ఇచ్చినా ఈ ‘జంబలకిడిపంబ’ గట్తెక్కవచ్చు. మురళీకృష్ణ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సిద్ధి ఇద్నని హీరోయిన్ గా నటించింది.