jalebi-rhea-chakrabortyతెలుగులో ‘తూనీగ తూనీగ’ సినిమా ద్వారా పరిచయం అయిన రియా చక్రబోర్తి గుర్తుందా? ఇటీవల తన సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫోటోలను పోస్ట్ చేసి నెటిజన్లను ఆశ్చర్యపరిచిన ఈ బ్యూటీ, ప్రస్తుతం బాలీవుడ్ లో నటిస్తోన్న తన తాజా చిత్రం “జలేబి” ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేసింది. నేడు విడుదలైన ఈ పోస్టర్ ను టాలీవుడ్ టాప్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ కూడా షేర్ చేసుకుంది.

ట్రైన్ విండో నుండి క్రిందకి ఒంగిపోయి మరీ లిప్ లాక్ ఇస్తోన్న ఈ ‘జలేబి’ పోస్టర్ వీక్షకులను ఆకర్షిస్తోంది. అక్టోబర్ 12వ తేదీన విడుదల కాబోతున్న ఈ సినిమా ద్వారా వరుణ్ మిత్రా, దిగంగాన సుర్యవంషి అనే ఇద్దరు హీరోలు పరిచయం అవుతున్నారు. ‘నీ టైం స్టార్ట్ అయ్యింది బేబీ’ అంటూ రియా చక్రబోర్తికి ఆల్ ది బెస్ట్ చెప్తూ రకుల్ ప్రీత్ సింగ్ తాజాగా ఈ పోస్టర్ ను తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసింది.