Jai Simha Movie 100 Days Function100 రోజులు ఎన్ని కేంద్రాలలో పడ్డాయి? అన్న రోజుల నుండి 100 కోట్లు ఎన్ని రోజులలో వచ్చాయి? అన్న కాలానికి సినీ పరిశ్రమతో పాటు అభిమానులు కూడా మారిపోయారు. ప్రస్తుతం పరిస్థితులలో ‘పాజిటివ్ టాక్’ వస్తే మహా అయితే ఓ రెండు, మూడు వారాల పాటు ధియేటర్లలో సినిమా ఆడడం గొప్ప. అదే ‘నెగటివ్’ టాక్ వస్తే మొదటి వారానికే సర్దేసుకునే పరిస్థితి. ఇది ఎవరూ కాదనలేని విషయం.

మరి ఇలాంటి రోజుల్లో బాలకృష్ణ నటించిన “జై సింహా” సినిమా 100 రోజుల వేడుక నిర్వహించడం అనేది ఎలాంటి సంకేతాలను ఇస్తుంది? సరే అభిమానులేదో ముచ్చటపడి ఇలాంటి వేడుకలను చేసుకున్నారంటే ఒక అర్ధం ఉంది. కానీ అలా కాక స్వయంగా బాలకృష్ణ ఈ 100 రోజుల పండగ కోసం గుంటూరు జిల్లా, చిలకలూరిపేటకు విచ్చేసి పాల్గొననుండడం ఎంతటి వారికైనా సమర్ధనీయం కాదు.

ఈ రోజుల్లో 100 రోజులు ఆడే సినిమాలు లేవు. అంతంతమాత్రం టాక్, బ్యాడ్ రివ్యూలను తెచ్చుకున్న ‘జై సింహా’ హండ్రెడ్ డేస్ ఎలా ఆడిందో “వాళ్ళకే” ఎరుక! దానిని మళ్ళీ ఇపుడు గ్రాండ్ గా సెలబ్రేట్ చేయడం అనేది ‘తమ పరువును తామే తీసుకుంటున్నట్లు కాదా?’ ఇలాంటి వాటిని ప్రోత్సహించడం అనేది ఒక హీరోగానే కాదు, ఒక ప్రజాప్రతినిధిగా కూడా బాలయ్యకు సమంజసం కాదని ఖచ్చితంగా తెలపాలి.