Jai Lava Kusa Jr NTR 7 million hits‘యంగ్ టైగర్’ జూనియర్ ఎన్టీఆర్ ‘జైలవకుశ’ టీజర్ తో యూ ట్యూబ్ రికార్డులు షేక్ అయ్యాయి. మొదటి రోజు పూర్తయ్యే సమయానికి అంతకుముందు ఉన్న గత చిత్రాల రికార్డులను అధిగమించి మొదటి స్థానంలో నిల్చున్నాడు ‘బుడ్డోడు.’ యూ ట్యూబ్ + ఫేస్ బుక్ కలిపి 7.8 మిలియన్ క్లిక్స్ ను అందుకోగా, ఒక్క యూ ట్యూబ్ లో 4.89 మిలియన్ క్లిక్స్ ను సొంతం చేసుకున్నాడు. ఈ అపూర్వమైన స్పందనకు కృతజ్ఞతలు తెలిపిన యంగ్ టైగర్, మున్ముందు ఇంకా బాగా చేయడానికి ప్రయత్నిస్తానని చెప్పుకొచ్చారు.

ఇక, ‘జై లవకుశ’ తర్వాత స్థానంలో ‘స్పైడర్’ టీజర్ 4.30 మిలియన్ క్లిక్స్ తో నిలువగా, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘కాటమరాయుడు’ టీజర్ 2.97 క్లిక్స్ తో మూడవ స్థానంలో నిలిచింది. ఆ తర్వాత అల్లు అర్జున్ “దువ్వాడ జగన్నాధమ్” 2.32 మిలియన్ క్లిక్స్ తో, యంగ్ రెబల్ స్టార్ “సాహో” 2.26 మిలియన్ క్లిక్స్ తో టాప్ 5లో ఉన్నాయి. ఇది కేవలం యూ ట్యూబ్ కు సంబంధించిన క్లిక్స్ మాత్రమే. ఈ జాబితాను పరిశీలిస్తే… ప్రతి టీజర్ కూడా అంతకుముందు విడుదలైన పెద్ద సినిమాల టీజర్ రికార్డులను బద్దలు కొడుతూ సాగుతున్నాయి.

అంటే ‘జై లవకుశ’ టీజర్ రికార్డులు మరికొద్ది రోజుల్లో బద్దలు కావడం ఖాయమే అన్నమాట..!